Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Raja Saab: మరోసారి వాయిదా పడ్డ రాజా సాబ్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తోన్న చిత్రాల్లో రాజాసాబ్ ఒకటి. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ హారర్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ కెరీర్ లో ఫస్ట్ టైమ్ హారర్ కామెడీ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

The Raja Saab: మరోసారి వాయిదా పడ్డ రాజా సాబ్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
Prabhas The Raja Saab
Rajeev Rayala
|

Updated on: Nov 04, 2025 | 1:49 PM

Share

రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ “రాజా సాబ్” వచ్చే సంక్రాంతికి జనవరి 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా విడుదల తేదీ మరోసారి వాయిదా పడిందంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారమవుతోంది. ఈ అసత్య ప్రచారనికి చెక్ పెట్టారు మూవీ టీమ్. అనుకున్న ప్రకారమే జనవరి 9న “రాజా సాబ్” సినిమా ఘనంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని వెల్లడించారు.

23ఏళ్లకే రూ. 250 కోట్లకు పైగా ఆస్తులు..ఈ సీరియల్ బ్యూటీ మామూల్ది కాదు భయ్యా..!

ప్రస్తుతం “రాజా సాబ్” సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. జనవరి 9న అన్ని భాషల్లో విడుదల చేసేందుకు రిలీజ్ సన్నాహాలు కూడా చేస్తున్నారు. ఐమ్యాక్స్ వెర్షన్ సహా అన్ని లార్జర్ ఫార్మేట్స్ లో “రాజా సాబ్” ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ లో యూఎస్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపనున్నారు. డిసెంబర్ 25వ తేదీలోగా ఫస్ట్ కాపీ రెడీ చేయబోతున్నారు. ఇలా అన్ని హంగులతో సంక్రాంతి సందడి రెట్టింపు చేసేందుకు “రాజా సాబ్” థియేటర్స్ లో అడుగుపెట్టేందుకు సన్నద్ధమవుతున్నాడు.

అప్పుడు మెగాస్టార్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..

టాలీవుడ్ నుంచి వస్తున్న మరో ప్రెస్టీజియస్ మూవీగా “రాజా సాబ్” ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

డబ్బుకోసం ముసలోడితో పెళ్లి.. మరొకడితో ఆ యవ్వారం.. ఓటీటీలో క్రేజీ రొమాంటిక్ మూవీ

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి