AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar collections: ఊచకోత కాదు.. బాక్సాఫీస్‌ నరుకుడు.. సంచలనంగా సలార్ కలెక్షన్స్‌

కలెక్షన్స్‌లో.. అన్‌స్టాపబుల్‌గా దూసుకుపోతోంది. ఇక ఇదే విషయాన్ని తమ ట్విట్టర్ ఎక్స్‌ హ్యాండిల్లో అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది హోంబలే టీం. అనౌన్స్ చేయడమే కాదు.. ఈ ఫీట్‌కు సంబంధించిన ఓ పోస్టర్‌ను కూడా... షేర్ చేసింది. దీంతో కొత్త సంవత్సరం మొదలైన వేళ... సలార్‌.. మరో సారి నెట్టింట ట్రెండ్‌ అవుతోంది.

Salaar collections: ఊచకోత కాదు.. బాక్సాఫీస్‌ నరుకుడు.. సంచలనంగా సలార్ కలెక్షన్స్‌
Salaar Movie
Follow us
Ram Naramaneni

| Edited By: Ravi Kiran

Updated on: Jan 02, 2024 | 12:41 PM

మరీ కామన్ అయిపోయింది.. ప్రభాస్‌ సినిమాలు 500 క్రోర్‌ క్లబ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం! మరీ కామన్ అయిపోయింది.. ప్రభాస్‌ సినిమాలు కలెక్షన్స్‌ రికార్డులను క్రియేట్ చేయడం.! మరీ కామన్ అయిపోయింది…. మనోడి సినిమా కలెక్షన్స్‌ను చూసి ఇండియన్ ఫిల్మ్ ఫెటిర్నిటీలోని మేకర్స్‌ అందరూ … షాక్ అవ్వడం..! అయితే ఇదే కామన్ థింగ్స్‌ సలార్ విషయంలో రిపీటవుతోంది. ఈ మూవీ 500 కాదు..కాదు.. 600 వందల కోట్ల మార్క్‌ను కూడా దాటేసింది. ఇండియన్ ఫిల్మ్ సర్కిల్లో హాట్‌ టాపిక్ అవుతోంది. ఎస్ ! ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్‌ చేసిన సలార్ సినిమా… తాజాగా 600క్రోర్ మార్క్‌ను దాటేసింది. డిసెంబర్ 22న రిలీజ్ అయిన ఈ మూవీ… తాజాగా వరల్డ్‌ వైడ్.. దాదాపు 625కోట్లను వసూలు చేసింది. కలెక్షన్స్‌లో.. అన్‌స్టాపబుల్‌గా దూసుకుపోతోంది. ఇక ఇదే విషయాన్ని తమ ట్విట్టర్ ఎక్స్‌ హ్యాండిల్లో అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది హోంబలే టీం. అనౌన్స్ చేయడమే కాదు.. ఈ ఫీట్‌కు సంబంధించిన ఓ పోస్టర్‌ను కూడా… షేర్ చేసింది. దీంతో కొత్త సంవత్సరం మొదలైన వేళ… సలార్‌.. మరో సారి నెట్టింట ట్రెండ్‌ అవుతోంది.

పవర్‌ ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సలార్‌ సినిమాలో శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా నటించింది. అలాగే మలయాళ సూపర్‌ స్టార్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ మరో కీలక పాత్రలో మెరిశాడు. వీరితో పాటు సీనియర్ నటి శ్రియారెడ్డి, బాబీ సింహ, టిను ఆనంద్, కన్నడ గరుడ రామచంద్ర, మధు గురుస్వామి, బాబీ సింహా, బ్రహ్మాజీ, నవీన్ పంజు, బజరంగీ లోకి, దేవరాజ్, సప్తగిరి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. రవి బ్రసూర్‌ సంగీతం అందించారు. కేజీఎఫ్ ఫేమ్ హోంబలే సంస్థ రూ.270 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సలార్‌ సినిమాను నిర్మించింది.

అన్ స్టాప బుల్ గా సలార్

𝑲𝒉𝒂𝒏𝒔𝒂𝒂𝒓… 𝑰’𝒎 𝑺𝒐𝒓𝒓𝒚!

ఇవి కూడా చదవండి

Unstoppable #SalaarCeaseFire has crossed a massive ₹ 𝟔𝟐𝟓 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 𝐆𝐁𝐎𝐂 (worldwide) #SalaarBoxOfficeStorm #RecordBreakingSalaar #SalaarRulingBoxOffice #Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan… pic.twitter.com/JFgqX99Ojv

— Salaar (@SalaarTheSaga) January 1, 2024

‘సలార్’ డైలాగ్ ప్రోమో వీడియో చూశారా?

Experience the biggest action entertainer, #SalaarCeaseFire in cinemas near you!

Here’s a new dialogue promo(Telugu) : https://t.co/b9sj3xSHOj#SalaarBoxOfficeStorm #RecordBreakingSalaar #SalaarRulingBoxOffice #Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan… pic.twitter.com/GEks7tKgdm

— Hombale Films (@hombalefilms) December 31, 2023

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..