Kalki 2898 AD: ‘ప్లీజ్.. దయచేసి అలాంటివి చేయకండి’.. ఆడియెన్స్‌కు ‘కల్కి’ నిర్మాతల రిక్వెస్ట్

ప్రభాస్ నటించిన 'కల్కి 2898 AD' ఈరోజు (జూన్ 27) విడుదలైంది. సినిమాకు అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మాస్ ఆడియన్స్, క్లాస్ ఆడియన్స్, ఫ్యామిలీ మూవీ లవర్స్, సినీ క్రిటిక్స్ అందరూ కల్కి సినిమాపై పాజిటివ్ ఒపీనియన్స్ వ్యక్తం చేశారు. దాదాపు 700 కోట్ల బ‌డ్జెట్‌తో తెరకెక్కిన కల్కి సినిమా రికార్డులను కొల్లగొడుతుందని మేకర్స్ ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నారు.

Kalki 2898 AD: 'ప్లీజ్.. దయచేసి అలాంటివి చేయకండి'.. ఆడియెన్స్‌కు 'కల్కి' నిర్మాతల రిక్వెస్ట్
Prabhas Kalki 2898 Ad Movie
Follow us

|

Updated on: Jun 27, 2024 | 6:06 PM

ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ ఈరోజు (జూన్ 27) విడుదలైంది. సినిమాకు అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మాస్ ఆడియన్స్, క్లాస్ ఆడియన్స్, ఫ్యామిలీ మూవీ లవర్స్, సినీ క్రిటిక్స్ అందరూ కల్కి సినిమాపై పాజిటివ్ ఒపీనియన్స్ వ్యక్తం చేశారు. దాదాపు 700 కోట్ల బ‌డ్జెట్‌తో తెరకెక్కిన కల్కి సినిమా గత రికార్డులను కొల్లగొడుతుందని మేకర్స్ ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నారు. ఈ నేపథ్యంలో కల్కి సినిమా విడుద‌ల‌య్యాక ద‌ర్శ‌క నిర్మాత‌లు సినీ ప్రియుల‌కి సోషల్ మీడియా వేదికగా ఓ రిక్వెస్ట్‌ చేశారు. ‘‘కల్కి’’ సినిమా మా నాలుగేళ్ల సుదీర్ఘ ప్రయాణం. నాగ్ అశ్విన్‌, అతని బృందం చేసిన సమష్ఠి కృషికి ఫలితమే ఈ సినిమా. హాలీవుడ్ ను తలపించేలా వరల్డ్ క్లాస్ క్వాలిటీస్ లో కల్కి తీయడానికి మా నుంచి అన్ని రకాల ప్రయత్నాలు చేశాం. క్వాలీటీలో మా టీమ్ ఎక్కడా రాజీ పడలేదు. మా టీం అంత కూడా చెమట, రక్తం ఓడ్చి ఈ సినిమాను మన ముందుకు తీసుకువచ్చారు. సినిమాను, క్రాప్ట్‌, మూవీ మేకింగ్‌ విషయంలో వారు పెట్టిన శ్రమను మనం గౌరవిద్దాం. థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకులు దయచేసి మొబైల్ ఫోన్లలో, కెమెరాలలో సన్నివేశాలను చిత్రీకరించకండి. మినిట్‌ మినిట్‌ మూవీ అప్‌డేట్‌ను లీక్‌ చేసి పైరసీలకు అవకాశం ఇవ్వోద్దు. అలాగే ఆడియన్స్‌ ఎక్స్‌పీరియన్స్‌ని స్పాయిల్‌ చేయొద్దని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాం’ అంటూ వైజయంతీ మూవీస్‌ బ్యానర్ నిర్మాతలు ట్వీట్ చేశారు.

ఇప్పటివరకు భారతదేశంలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం ‘కల్కి’ నేనని తెలుస్తోంది. ఈ సినిమా కోసం వైజయంతీ మూవీస్ సుమారు 700 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దాదాపు నాలుగేళ్ల పాటు ఈ సినిమా కోసం శ్రమించారు. ఇక ఈ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత అశ్వినీదత్ అల్లుడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది. అలాగే బిగ్ బీ అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్, దిశా పటానీ, శోభన, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం తదితరలు ప్రధాన పాత్రల్లో మెరిశారు. ఇక విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రామ్ గోపాల్ వర్మ తదితరులు క్యామియో రోల్స్ పోషించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో