Prabhas: ‘సలార్’ సెట్‌లో ప్రశాంత్ నీల్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ‘ఆల్ బ్లాక్’లో అదిరిపోయిన ప్రభాస్ లుక్
'కేజీఎఫ్' సిరీస్‌తో ఓవర్‌నైట్‌లో క్రేజీ డైరెక్టర్‌గా మారిపోయారు ప్రశాంత్ నీల్. పాన్ ఇండియా డైరెక్టర్‌గా ఎనలేని గుర్తింపు తెచ్చుకున్నారు. తన సినిమాలతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన ప్రశాంత్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో ప్రభాస్‌తో సినిమా తీస్తున్నారు.

‘కేజీఎఫ్’ సిరీస్‌తో ఓవర్‌నైట్‌లో క్రేజీ డైరెక్టర్‌గా మారిపోయారు ప్రశాంత్ నీల్. పాన్ ఇండియా డైరెక్టర్‌గా ఎనలేని గుర్తింపు తెచ్చుకున్నారు. తన సినిమాలతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన ప్రశాంత్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో ప్రభాస్‌తో సినిమా తీస్తున్నారు. సలార్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. శ్రుతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతి బాబుతో పాటు పలువురు బాలీవుడ్ నటీనటులు ఈ సినిమాలో పాలు పంచుకొంటున్నారు. కాగా శనివారం (జూన్3) ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సలార్ సెట్‌లో స్టార్ డైరెక్టర్ బర్త్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రభాస్ పాల్గొని సందడి చేశారు. దగ్గరుండి ప్రశాంత్‌తో కేకు కట్ చేయించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. కాగా ఈ వేడుకల్లో ఆల్ బ్లాక్ డ్రెస్‌తో ప్రభాస్ లుక్ అదిరిపోయిదంటున్నారు ఫ్యాన్స్.
కాగా ప్రభాస్ నటించిన ఆది పురుష్ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. రామాయణం ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ సినిమాలో కృతిసనన్ హీరోయిన్‌గా నటించింది. ఓం రౌత్ దర్శకత్వం వహించారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా మంగళవారం (జూన్ 6)న తిరుపతిలో ఆది పురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరగనుంది. ఇక సలార్ సినిమాతో పాటు స్పిరిట్, ప్రాజెక్టు కే వంటి క్రేజీ ప్రాజెక్టులు ప్రభాస్ చేతిలో ఉన్నాయి.




Warmest birthday wishes to the incredibly talented director #PrashanthNeel.
From the sets of @Salaarthesaga: https://t.co/ngbTEv593L#HBDPrashanthNeel #Prabhas #Salaar pic.twitter.com/XIQEiF5RkS
— Salaar (@SalaarTheSaga) June 4, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..