Pawan Kalyan: అన్నయ్య నుంచి మనకు అవసరం లేదు అనుకున్న విషయం ఇదే.. పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్ ఇటీవల నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న అన్ స్టాపబుల్ షోకు గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేశారు ఆహా టీమ్.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో ఉండే క్రేజే వేరు. పవన్ కంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ కు పండగ వచ్చినట్టే.. పూలాభిషేకాలు, పాలాభిషేకాలు, అంటూ రచ్చ రచ్చ చేస్తుంటారు. ఇటీవలే కంబ్యాక్ ఇచ్చిన పవన్.. వకీల్ సాబ్, భీమ్లానాయక్ సినిమాలతో వరుస విజయాలను అందుకున్నారు. ఇక ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేశారు. ఈ క్రమంలో క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్నారు పవన్. అలాగే హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ తో ఓజీ అనే సినిమాలు చేస్తున్నారు పవన్ .
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఇటీవల నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న అన్ స్టాపబుల్ షోకు గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేశారు ఆహా టీమ్. మొన్నామధ్య మొదటి పార్ట్ స్ట్రీమింగ్ అవ్వగా.. తాజాగా సెకండ్ పార్ట్ కూడా స్ట్రీమింగ్ చేశారు. ఇదిలా ఉంటే సెకండ్ పార్ట్ లో ఎక్కువగా రాజకీయాలపైనే డిస్కస్ చేశారు పవన్ , బాలయ్య.
కాగా ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చే విషయం పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ తో మల్టీస్టారర్ సినిమా చేయడానికి ఓకే చెప్పారు పవన్ కళ్యాణ్. “నా చిన్నప్పటి నుంచి అన్నయ్యను చూస్తూ పెరిగాను. ఎలాంటి వనరులు లేని రోజుల్లోనే ఆయన 3 షిఫ్టులుగా పనిచేసేవారు. షూటింగ్స్ లో తగినన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు లేని రోజుల్లో ఆయన ఫైట్స్ చేసి గాయపడేవారు అని తెలిపారు. అలాగే ఆయనను చూసి ఇది మనకు అవసరం లేదు అనుకున్నది కూడా ఉంది .. అదే మొహమాటం. అన్నయ్యకి మొహమాటం ఎక్కువ అని అన్నారు పవన్.
