Pooja Hegde: వరుసగా ఐదు ఫ్లాప్‌లు.. ఇక ఈ ముముద్దుగుమ్మను మహేషే ఆదుకోవాలి
స్టార్ హీరోల సినిమాలు అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. వీటిలో ముందుగా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా గురించి చెప్పుకోవాలి. ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ స్మార్ట్ లుక్ లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కానీ ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.
కొంతమంది హీరోయిన్స్ వరుసగా ఫ్లాప్ లు వచ్చినా కూడా క్రేజ్ మాత్రం తగ్గదు.. ఆ లిస్ట్ లో చేరిపోయింది పొడుగు కాళ్ళ సుందరి పూజ హెగ్డే.. ఇటీవల ఈ అమ్మడు నటించిన సినిమాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. స్టార్ హీరోల సినిమాలు అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. వీటిలో ముందుగా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా గురించి చెప్పుకోవాలి. ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ స్మార్ట్ లుక్ లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కానీ ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఆ తర్వాత వచ్చిన తలపతి విజయ్ బీస్ట్ మూవీ కూడా ఫ్లాప్ టాక్ ను మూటకట్టుకుంది.నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన బీస్ట్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. తెలుగు, తమిళ్ భాషలో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.
అలాగే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమాలోకూడా పూజా హెగ్డే నటించింది. ఈ సినిమా ఎంత డిజాస్టర్ అయ్యింది అందరికి తెలుసు. ఈ సినిమా మెగా ఫ్యాన్స్ ను చాలా నిరాశపరిచింది. ఆ తర్వాత బాలీవుడ్ లో సర్కస్ అనే సినిమా చేసింది రణవీర్ కపూర్ హీరోగా నటించిన ఈ మూవీ దారుణంగా ఫ్లాప్ అయ్యింది.
ఇక రీసెంట్ గా వచ్చిన సల్మాన్ ఖాన్ కిసీ కి భాయ్.. కిసీ కి జాన్ అనే సినిమా లో నటించింది. ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో వెంకటేష్ కీలక పాత్రలో నటించారు. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నటిస్తోంది పూజ హెగ్డే. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మాస్ మసాలా కంటెంట్ తో రానున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా ఈ మూవీ నుంచి మహేష్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమా పైనే బోలెడన్ని ఆశలు పెట్టుకుంది పూజా. మహేష్ బాబు పూజకు సక్సెస్ అందిస్తారేమో చూడాలి.