Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్‌కు నోటీసులు.. దెబ్బకు సినిమానే ఆపేశారు.. కారణం ఏంటంటే

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఆచి తూచి సినిమాలు చేస్తున్నాడు. రోడ్డు ప్రమాదం నుంచి బయట పడిన తర్వాత తేజ్ స్పీడ్ తగ్గించాడు. కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాడు. విరూపాక్ష సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తేజ్ ఆతర్వాత బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించాడు తేజ్.

Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్‌కు నోటీసులు.. దెబ్బకు సినిమానే ఆపేశారు.. కారణం ఏంటంటే
Sai Dharam Tej
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 24, 2025 | 10:53 AM

సూప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా ప్రస్తుతం సంబరాల ఎటి గట్టు అనే సినిమా చేస్తున్నాడు. తేజ్ తన కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నాడు. సక్సెస్ కోసం చాలా కాలం ఎదురుచూశాడు.  కెరీర్ లో ఎన్నో ఫ్లాప్స్ చూశాడు. ఆతర్వాత ఆచితూచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. చిత్రలహరి, సోలో బ్రతుకే సోబెటర్, రిపబ్లిక్, విరూపాక్ష సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు తేజ్. ఇక తేజ్ ఆ మధ్య గంజా శంకర్ అనే సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఓ వీడియో గ్లింప్స్ కూడా విడుదల చేశారు. సంపత్ నంది దర్శకత్వంలో ఆ సినిమాను అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా ఏమైపోయిందో తెలియదు. ఎక్కడ గంజా శంకర్ సినిమా గురించిన టాక్ లేదు. దీని పై తాజాగా దర్శకుడు సంపత్ నంది స్పందించాడు.

సంపత్ నంది ప్రస్తుతం ఓదెల 2 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సంపత్ మాట్లాడుతూ.. సినిమాను ఆపేశాం అని తెలిపాడు. గంజా శంకర్ సినిమాకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. నాకు, సాయి ధరమ్ తేజ్ కు, నిర్మాతకు నోటీలు ఇచ్చారు పోలీసులు. కథను బట్టి టైటిల్ పెట్టాం.. అయితే టైటిల్ మార్చమని చెప్పారు. టైటిల్ మార్చితే కథ పూర్తిగా మార్చాలి దాని కంటే సినిమా ఆపేయడమే బెటర్ అనిపించింది ఆపేశాం అని తెలిపాడు సంపత్ నంది.

‘గాంజా శంకర్’ మూవీకి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ న్యాబ్) పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ మూవీలో గంజాయి పదాన్ని తొలగించాలని నోటీసులో సూచించారు టిఎస్ న్యాబ్ పోలీసులు. సినిమాలో మాదకద్రవ్యాల సంబంధించిన అభ్యంతరక సన్నివేశాలు ఉంటే ఎన్డీపీఎస్ – 1985 చర్యలు తీసుకుంటామని హెచ్చారించారు. ఈ చిత్రంలో గంజాయి మొక్కల్ని చూపించడంతోపాటు ప్రోత్సాహిస్తున్నట్లు సన్నివేశాలు ఉన్నాయని నోటీసుల్లో పేర్కొన్నారు.అలాగే సినిమా టైటిల్ విద్యార్థులు, యువతపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. మాదకద్రవ్యాలను వినియోగాన్ని సాధారణంగా ఉన్నట్లు సినిమాలో సన్నివేశాలను ఉంటే వాటిని వెంటనే తొలగించాలని.. గంజాయి సన్నివేశాలు డైలాగులు లేకుండా చూడాలని నోటీసుల్లో పేర్కొన్నారు టీఎస్ న్యాబ్ పోలీసులు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కైలాస పర్వతం ఎందుకు ఎక్కలేకపోతున్నారు.. అతను మాత్రం ఎలా ఎక్కాడు
కైలాస పర్వతం ఎందుకు ఎక్కలేకపోతున్నారు.. అతను మాత్రం ఎలా ఎక్కాడు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మ్యాంగో.. దీని ధర తెలిస్తే..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మ్యాంగో.. దీని ధర తెలిస్తే..
క్యాన్సర్‌ను పారదోలే అద్భుత ఫలం.. కనిపిస్తే అస్సలు వదలొద్దు..
క్యాన్సర్‌ను పారదోలే అద్భుత ఫలం.. కనిపిస్తే అస్సలు వదలొద్దు..
ఇతను తలపై కత్తెర పెడితే మినిమం లక్ష..ఎందుకంటే..
ఇతను తలపై కత్తెర పెడితే మినిమం లక్ష..ఎందుకంటే..
ఈ కోతికి అల్లరే కాదు.. ప్రేమ కూడా ఎక్కువే.. వీడియో
ఈ కోతికి అల్లరే కాదు.. ప్రేమ కూడా ఎక్కువే.. వీడియో
పెంపుడు కుక్కతో విమానం ఎక్కబోయిన మహిళ..సిబ్బంది అడ్డుకోవడంతో..!
పెంపుడు కుక్కతో విమానం ఎక్కబోయిన మహిళ..సిబ్బంది అడ్డుకోవడంతో..!
దుబాయ్‌లోని దేవాలయంలో అల్లు అర్జున్‌ వీడియో
దుబాయ్‌లోని దేవాలయంలో అల్లు అర్జున్‌ వీడియో
పొదల్లో దొరికిన 120 గుడ్లు.. వాటిని తీసుకెళ్లి పొదగేసిన అధికారులు
పొదల్లో దొరికిన 120 గుడ్లు.. వాటిని తీసుకెళ్లి పొదగేసిన అధికారులు
డిస్పోజబుల్‌ కప్స్‌, కవర్స్‌.. డేంజర్‌ బెల్స్‌ వీడియో
డిస్పోజబుల్‌ కప్స్‌, కవర్స్‌.. డేంజర్‌ బెల్స్‌ వీడియో
జనసేన కార్యకర్త కొడుకును భుజంపైకి ఎక్కించుకున్న పవన్‌ కల్యాణ్‌..
జనసేన కార్యకర్త కొడుకును భుజంపైకి ఎక్కించుకున్న పవన్‌ కల్యాణ్‌..