AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anasuya: దొరికేసాడు.. అనసూయపై బ్యాడ్ కామెంట్స్ చేసిన వ్యక్తి అరెస్ట్ .. అతను ఎవరంటే

టాలీవుడ్ నటి, స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె పై అసభ్యకరమైన పోస్టులు పెడుతూ వేధింపులకు పాల్పడిన ఒక వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు .

Anasuya: దొరికేసాడు.. అనసూయపై బ్యాడ్ కామెంట్స్ చేసిన వ్యక్తి అరెస్ట్ .. అతను ఎవరంటే
Anasuya Bharadwaj
Rajeev Rayala
|

Updated on: Apr 21, 2026 | 11:19 AM

Share

అందాల భామ అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. సినిమాలు, టీవీ షోలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే అనసూయ రెగ్యులర్ గా తన సినిమా అప్డేట్స్ తో పాటు తన ఫ్యామిలీ ఫోటోలను, తన ఫోటో షూట్స్ ను పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అలాగే తనపై నెగిటివ్ కామెంట్స్ చేసే వారికి కూడా అదిరిపోయే రేంజ్ లో కొంటర్లు ఇస్తూ ఉంటుంది. సమాజంలో జరిగే విషయాల పై అనసూయ ఎప్పుడూ స్పందించడానికి ముందుంటుంది. అలాగే తన పై ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ చేస్తే వారిని వదిలిపెట్టదు.. తనదైన స్టైల్ లో స్ట్రాంగ్ కౌంటర్లు, వార్నింగ్స్ ఇస్తుంటుంది అనసూయ. ఇదిలా ఉంటే ఇటీవల అనసూయ పై కొందరు అసభ్యకర కామెంట్స్ చేశారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మూగ అమ్మాయిని సినిమాల్లోకి తీసుకురావడం పిచ్చితనం అన్నారు.. అందం ఇచ్చిన దేవుడు మాట ఇవ్వలేదు

సోషల్ మీడియా వేదికలపై తన పరువు నష్టం కలిగించేలా, అభ్యంతరకరమైన కంటెంట్‌ను ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది అనసూయ. రంగంలోకి దిగిన పోలీసులు అనసూయ పై బ్యాడ్ కామెంట్స్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన 30 ఏళ్ల వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం అల్వాల గ్రామానికి చెందిన దోరేపల్లి చంటిగా గుర్తించారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

ఆర్తి అగర్వాల్ చనిపోవడానికి అసలు కారణం అదే.. అవమానాలు ఎదుర్కొందన్న దర్శకుడు

డిసెంబర్ 23, 2025 నుండి పలువురు వ్యక్తులు సోషల్ మీడియా పేజీలు, వివిధ ఆన్‌లైన్ వేదికలపై తనపై పరువు నష్టం కలిగించే విధంగా దూషించడం, అలాగే అసభ్యకరమైన వ్యాఖ్యలను పోస్ట్ చేస్తూ, ప్రచారం చేస్తున్నారని, దీనివల్ల తన ప్రతిష్టకు, గౌరవానికి హాని వాటిల్లిందని అనసూయ భరద్వాజ్ నుంచి ఫిర్యాదు అందిందని సైబర్ క్రైమ్స్ డీసీపీ టి. సాయి మనోహర్ తెలిపారు. సోషల్ మీడియా వినియోగదారులు బాధ్యతాయుతమైన ఆన్‌లైన్ ప్రవర్తనను పాటించాలని, దూషణాత్మక, పరువు తీసే లేదా అభ్యంతరకరమైన వ్యాఖ్యలను పోస్ట్ చేయకుండా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు.

ఆయన్ని ఇలా చూస్తే ప్రాణం చివ్వుక్కుమంది..! నడవలేని స్థితిలో లెజెండ్రీ డైరెక్టర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us