AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరోయిన్ వల్లే బ్రతికున్నా.. లేకపోతే ఆరోజే.. షాకింగ్ విషయం చెప్పిన ప్రేమఖైదీ హీరో హరీష్

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు సంచలనం సృష్టించిన సినిమా ప్రేమ ఖైదీ. ఇందులో హరీష్, మాల శ్రీ హీరోహీరోయిన్లుగా నటించారు. అప్పట్లో ఈ మూవీ ఘన విజయం సాధించడమే కాకుండా భారీ వసూళ్లు రాబట్టింది. ఇక ఇదే చిత్రాన్ని హిందీలోనూ రీమేక్ చేశారు.

ఆ హీరోయిన్ వల్లే బ్రతికున్నా.. లేకపోతే ఆరోజే.. షాకింగ్ విషయం చెప్పిన ప్రేమఖైదీ హీరో హరీష్
Hareesh
Rajeev Rayala
|

Updated on: Apr 19, 2026 | 1:04 PM

Share

ప్రేమ కథలతో తెరకెక్కిన సినిమాలు ఎప్పుడు సూపర్ హిట్ అవుతుంటాయి. ఇప్పటికే ఇండస్ట్రీలో ఎన్నో ప్రేమకథ చిత్రాలు సెన్సేషన్ గా మారాయి. వాటిలో ఎవర్ గ్రీన్ మూవీ ప్రేమ ఖైదీ ఒకటి. అప్పట్లో ఈ మూవీ సెన్సెషన్ అయ్యింది. కుర్రాళ్లు ఎగబడి చూశారు ఈ సినిమాను. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీతో తెలుగు తెర పై సెన్సెషన్ క్రియేట్ చేశాడు హీరో హరీష్. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. ప్రేమ ఖైదీ తర్వాత హరీష్ కు ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ప్రేమ కానుకగా.. ప్రేమాభిషేకం వంటి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇవే కాకుండా పెళ్లాం చెబితే వినాలి.. రౌడీ ఇన్‏స్పెక్టర్.. కాలేజీ బుల్లోడు.. ప్రేమ విజేతా.. ప్రాణదాత, మనవరాలి పెళ్లి , బంగారు కుటంబం వంటి చిత్రాలతో అప్పట్లోనే స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు.

30కి పైగా సినిమాలు, 40కి పైగా టీవీ షోలు.. కట్ చేస్తే ఇప్పుడు ఆ జిల్లాకు కలెక్టర్

హరీష్ హీరోగానే కాకుండా చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించాడు. ఆంధ్రకేసరి, నటుడిగా ఒహో నా పెళ్లంట సినిమాలకు బాలనటుడిగా నంది అవార్డులు అందుకున్నారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీలో సూపర్ హిట్స్ అందుకున్నారు. ఈ హీరోకు దక్షిణాదితోపాటు ఉత్తరాదిలోనూ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. భారతీయ సినిమా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హరీష్ కు అప్పట్లో అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉండేది.

16ఏళ్ల వయసులో ఎంట్రీ.. 1000కి పైగా సినిమాలు.. చనిపోయే వరకు నటించిన నటి

వరుసగా హిట్ చిత్రాల్లో వెండితెరపై సందడి చేసిన ఈ హీరోకు ఆతర్వాత ఫ్లాప్స్ పలకరించాయి. దాంతో మెల్లగా అవకాశాలు దూరమయ్యాయి. దీంతో కొన్ని సినిమాల్లో సహాయ పాత్రలలో కనిపించారు. ఆ తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా హరీష్ ఓ హీరోయిన్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రేమఖైదీ సినిమాను హిందీలోనూ రీమేక్ చేశారు. ఈ సినిమాలో హీరోగా హరీష్ నటించగా హీరోయిన్ గా కరిష్మా కపూర్ నటించింది. అయితే ఈ సినిమాలో ఓ సన్నివేశంలో కరిష్మా స్విమింగ్ పూల్‌లోకి దూకగా, ఆమెను రక్షించేందుకు హరీష్ కూడా దూకాల్సి ఉంటుంది. అయితే హరీష్ కు ఈత రాదని తెలియని యూనిట్ సభ్యులు లోతైన స్విమ్పింగ్ పూల్ ను ఏర్పాటు చేశారట.. తీరా పూల్ లోకి దూకగానే హరీష్ మునిగిపోయారట.. అందరూ ఎదో ప్రాంక్ చేస్తున్నాడు అనుకున్నారట.. చివరికి అతని ప్రాణాపాయం అని గమనించిన హీరోయిన్ కరిష్మా హరీష్ ను కాపాడారట.. ఆమె దుస్తులు పట్టుకొని నీళ్లలో నుంచి బయటకు వచ్చాను అని హరీష్ ఓ ఇంటర్వూలో తెలిపారు.

ఇవి కూడా చదవండి

అబ్బో.. ఈ అమ్మడు మామూల్ది కాదు..! చేసింది 7 సినిమాలు ఆస్తిమాత్రం రూ. 700కోట్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
లక్షలు ఖర్చు పెట్టే ఏసీ ఎందుకు..? కూలర్‌ అనే బెస్ట్ ఆప్షన్ ఉండగా
లక్షలు ఖర్చు పెట్టే ఏసీ ఎందుకు..? కూలర్‌ అనే బెస్ట్ ఆప్షన్ ఉండగా
తినడం రాంగ్ టైమ్.. పడుకోవడం రాంగ్ టైమ్.. దెబ్బతింటున్న ఆరోగ్యం
తినడం రాంగ్ టైమ్.. పడుకోవడం రాంగ్ టైమ్.. దెబ్బతింటున్న ఆరోగ్యం
వామ్మో.. ఐపీఎల్ 2026లో వైభవ్ సంపాదన తెలిస్తే షాకవ్వాల్సిందే..?
వామ్మో.. ఐపీఎల్ 2026లో వైభవ్ సంపాదన తెలిస్తే షాకవ్వాల్సిందే..?
హైదరాబాద్‌కు గ్లోబల్ దిగ్గజాల క్యూ..వేల ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌కు గ్లోబల్ దిగ్గజాల క్యూ..వేల ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్
ఇన్నాళ్లు మటన్ అనుకుని లాగించేశారు.. చివరకు బయటపడిన అసలు నిజం!
ఇన్నాళ్లు మటన్ అనుకుని లాగించేశారు.. చివరకు బయటపడిన అసలు నిజం!
హీరోయిన్‏గా రాను బొంబాయికి రాను సాంగ్ డ్యాన్సర్..
హీరోయిన్‏గా రాను బొంబాయికి రాను సాంగ్ డ్యాన్సర్..
ఓసి బుజ్జి తల్లో.. గూడు చూడండి ఎక్కడ పెట్టిందో..
ఓసి బుజ్జి తల్లో.. గూడు చూడండి ఎక్కడ పెట్టిందో..
సోంపుతో ఈజీగా వెయిట్ లాస్..ఇలా తీసుకుంటే కొవ్వు ఐస్‌ల కరుగుతుంది!
సోంపుతో ఈజీగా వెయిట్ లాస్..ఇలా తీసుకుంటే కొవ్వు ఐస్‌ల కరుగుతుంది!
కరివేపాకు పచ్చగా,దట్టంగా ఎలా పెంచాలి? సింపుల్‌ టిప్స్‌తో గుబురుగా
కరివేపాకు పచ్చగా,దట్టంగా ఎలా పెంచాలి? సింపుల్‌ టిప్స్‌తో గుబురుగా
ఉపాధిహామీ దంపతుల షష్టిపూర్తి వేడుకకు ఫిదా అవుతున్న జనం!
ఉపాధిహామీ దంపతుల షష్టిపూర్తి వేడుకకు ఫిదా అవుతున్న జనం!