AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆయన్ని ఇలా చూస్తే ప్రాణం చివ్వుక్కుమంది..! నడవలేని స్థితిలో లెజెండ్రీ డైరెక్టర్

దిగ్గజ దర్శకులు చాలా మంది ఎన్నో అద్భుతమైన సినిమాలను మనకు అందించారు. వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న దర్శకులు ఒకరు. ఆయన అందించిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆయన సినిమాలు ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. ఆయన ఎవరో తెలుసా.?

ఆయన్ని ఇలా చూస్తే ప్రాణం చివ్వుక్కుమంది..! నడవలేని స్థితిలో లెజెండ్రీ డైరెక్టర్
Tollywood6
Rajeev Rayala
|

Updated on: Apr 19, 2026 | 8:28 AM

Share

తమ సినిమాలతో ఎంతో మంది ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేశారు. నటీనటులు మాత్రమే కాదు దర్శకులు కూడా తమ సత్తా చాటి ఇండస్ట్రీలో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారు. తమ సినిమాతో ఇండస్ట్రీ కీర్తిని పెంచిన దర్శకులు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు యంగ్ దర్శకులు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే వారికి స్పూర్తిగా నిలిచిన చాలా మంది సీనియర్ దర్శకులు ఇప్పుడు సినిమాల స్పీడ్ తగ్గించారు. వయసు రీత్యా చాలా మంది దర్శకులు ఇప్పుడు సినిమాల జోలికి వెళ్లడం లేదు. వారిలో దిగ్గజ దర్శకుడు భారతి రాజా ఒకరు. గ్రామీణ జీవితాన్ని తెరపై నిజమైన భావోద్వేగాలతో ఆవిష్కరించిన దర్శకుడు భారతి రాజా. ముఖ్యంగా తమిళ సినీ రంగంలో ఆయన చేసిన సేవలు అమూల్యమైనవి. సహజత్వం, గ్రామీణ సంస్కృతి, మానవ సంబంధాల లోతైన భావాలను సినిమాల్లో చూపించడంలో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు.

30కి పైగా సినిమాలు, 40కి పైగా టీవీ షోలు.. కట్ చేస్తే ఇప్పుడు ఆ జిల్లాకు కలెక్టర్

1977లో దర్శకుడిగా పరిచయమైనా భారతీ రాజా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి పని చేశారు భారతీ రాజా.. ఇక భారతీ రాజా తెలుగులో చేసిన అద్భుతమైన సినిమా సీతాకోక చిలుక. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఆయన తెరకెక్కించిన ఎర్ర గులాబీలు (1979 – సిగప్పు రోజాక్కళ్ డబ్బింగ్), టిక్ టిక్ టిక్ , జమదగ్ని , ఆరాధన , కొత్త జీవితాలు, యువతరం పిలిచింది, ఈ తరం ఇల్లాలు, ముద్దుల చెల్లెలు, ఖైదీ వేట సినిమాలు తెలుగులో ఆకట్టుకున్నాయి.

ఇవి కూడా చదవండి

16ఏళ్ల వయసులో ఎంట్రీ.. 1000కి పైగా సినిమాలు.. చనిపోయే వరకు నటించిన నటి

ఇక భారతీ రాజా నటుడిగానూ ఆకట్టుకున్నారు. పలు సినిమాల్లో ఆయన నటించారు కూడా.. ధనుష్ నటించిన ఈసినిమాలో ఆయన కనిపించాడు. ఇదిలా ఉంటే భారతీ రాజా ఇప్పుడు వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇప్పుడు నడవలేని స్థితిలో ఉన్నారు ఆయన. తాజాగా భారతీరాజాను రాధికా శరత్ కుమార్ కలిశారు. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో భారతీ రాజా నడవలేని స్థితిలో వీల్ చైర్ లో కనిపించారు. ఆయననుఁ అలా చూడగానే ప్రాణం చివ్వుక్కుమంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అబ్బో.. ఈ అమ్మడు మామూల్ది కాదు..! చేసింది 7 సినిమాలు ఆస్తిమాత్రం రూ. 700కోట్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
10వ తరగతి, ఐటీఐతో రైల్వేలో 2,008 ఉద్యోగాలు.. నవంబర్ 6 వరకే ఛాన్స్
10వ తరగతి, ఐటీఐతో రైల్వేలో 2,008 ఉద్యోగాలు.. నవంబర్ 6 వరకే ఛాన్స్
పండగ ముందు సామాన్యులకు బిగ్‌ రిలీఫ్.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు
పండగ ముందు సామాన్యులకు బిగ్‌ రిలీఫ్.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు
లగ్జరీ లైఫ్ కాదని వ్యవసాయంతో నానా పటేకర్ అద్భుత ప్రపంచం..
లగ్జరీ లైఫ్ కాదని వ్యవసాయంతో నానా పటేకర్ అద్భుత ప్రపంచం..
ఓపెనర్లుగా అత్యధిక పరుగులు సాధించిన టాప్ 6 వీరులు వీరే
ఓపెనర్లుగా అత్యధిక పరుగులు సాధించిన టాప్ 6 వీరులు వీరే
ఆ మేయర్ సీట్లు ఎవరికి..? కూటమిలో ఎవరి లెక్కలు వారివే
ఆ మేయర్ సీట్లు ఎవరికి..? కూటమిలో ఎవరి లెక్కలు వారివే
అజిత్ అగర్కర్ బీసీసీఐ ద్వారా ఎంత సంపాదించారో తెలుసా?
అజిత్ అగర్కర్ బీసీసీఐ ద్వారా ఎంత సంపాదించారో తెలుసా?
నేషనల్ ఇన్సూరెన్స్‌ కంపెనీలో 321 ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం
నేషనల్ ఇన్సూరెన్స్‌ కంపెనీలో 321 ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం
తెలంగాణ గడ్డపై బతుకమ్మకు ఇంత ప్రత్యేకత ఎందుకు?
తెలంగాణ గడ్డపై బతుకమ్మకు ఇంత ప్రత్యేకత ఎందుకు?
17 వేల అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. ఆ తర్వాత సీన్ ఇదే
17 వేల అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. ఆ తర్వాత సీన్ ఇదే
భారత్‌లో స్టార్‌లింక్‌ను అడ్డుకుంటున్నారు: ఎలాన్ మస్క్
భారత్‌లో స్టార్‌లింక్‌ను అడ్డుకుంటున్నారు: ఎలాన్ మస్క్