AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్తి అగర్వాల్ చనిపోవడానికి అసలు కారణం అదే.. అవమానాలు ఎదుర్కొందన్న దర్శకుడు

సినీరంగుల ప్రపంచంలో హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన తారలు… అంతలోనే ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. దివ్య భారతి, సౌందర్య, సిల్క్ స్మిత వంటి తారలు సినీరంగంలో చక్రం తిప్పారు. చిన్న వయసులోనే కన్నుమూశారు. అలాగే హీరోయిన్ ఆర్తి అగర్వాల్ సైతం చిన్న వయసులోనే మరణించారు

ఆర్తి అగర్వాల్ చనిపోవడానికి అసలు కారణం అదే.. అవమానాలు ఎదుర్కొందన్న దర్శకుడు
Aarthi Agarwal
Rajeev Rayala
|

Updated on: Apr 19, 2026 | 8:56 AM

Share

ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా రాణించింది నటి ఆర్తి అగర్వాల్. చేసింది తక్కువ సినిమాలే అయినా తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. స్టార్ హీరోల సినిమాల్లో నటించి స్టార్ డమ్ సొంతం చేసుకుంది. ఉదయ్ కిరణ్, తరుణ్ లాంటి యంగ్ హీరోలతో పాటు చిరంజీవి, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోల సినిమాల్లోనూ నటించి ఆకట్టుకుంది ఆమె.. కానీ ఆమె మరణం అభిమానులకు, ఇండస్ట్రీకి ఊహించని షాక్ ఇచ్చింది. కాగా దర్శకుడు అమ్మ రాజశేఖర్ ఇటీవల ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో దివంగత నటి ఆర్తి అగర్వాల్ సినీ ప్రస్థానం, ఆమె ఎదుర్కొన్న కష్టాలపై లోతైన విషయాలను పంచుకున్నారు. తాను ఆర్తి అగర్వాల్‌కు మంచి ఫ్రెండ్‌నని, ఆమె తొలి సినిమా “నువ్వు నాకు నచ్చావ్”కి డాన్స్ మాస్టర్‌గా పనిచేసినట్లు తెలిపారు. ఆ సినిమాలో వెంకటేష్‌తో కలిసి ఊటీలో చిత్రీకరించిన “నువ్వు నాకు నచ్చావ్” పాట సమయంలో ఆర్తి అగర్వాల్ “లడ్డులా” క్యూట్‌గా, అమెరికన్ అమ్మాయిలా కనిపించిందని గుర్తుచేసుకున్నారు.

30కి పైగా సినిమాలు, 40కి పైగా టీవీ షోలు.. కట్ చేస్తే ఇప్పుడు ఆ జిల్లాకు కలెక్టర్

ఆర్తి అగర్వాల్ పతనం వెనుక ప్రధాన కారణం ఒక ప్రేమ వ్యవహారం అని అమ్మ రాజశేఖర్ వెల్లడించారు. ఈ ప్రేమ కారణంగా ఆమె మానసికంగా చాలా డిస్టర్బ్ అయ్యిందని, దాని ప్రభావం ఆమె సినిమాలపై, కెరీర్‌పై పడిందని పేర్కొన్నారు. ఈ మానసిక ఒత్తిడి తర్వాత ఆమె బరువు పెరిగిందని, దీనివల్ల సినిమా అవకాశాలు తగ్గిపోయాయని వివరించారు. ఉదాహరణకు, “రణం 2” సినిమాలో తాను ఆమెను ప్రధాన పాత్ర కోసం బుక్ చేశానని, అయితే రెండవ షెడ్యూల్‌కు పిలిచినప్పుడు ఆమె బాగా బరువు పెరిగిందని, జాకెట్లు సరిపోలేదని చెప్పారు. ఆమె తండ్రి ఆమెను తిరిగి స్లిమ్‌గా మార్చడానికి తీవ్రంగా ప్రయత్నించారని, కొన్ని శస్త్రచికిత్సలు కూడా చేయించారని, కానీ అవి విఫలమయ్యాయని రాజశేఖర్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

16ఏళ్ల వయసులో ఎంట్రీ.. 1000కి పైగా సినిమాలు.. చనిపోయే వరకు నటించిన నటి

కెరీర్‌లో ఎంతటి శిఖరాలను అధిరోహించిందో, అదే స్థాయిలో అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఇది ఆమెకు మరింత బాధ కలిగించిందని ఆయన అన్నారు ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆర్తి అగర్వాల్ కెరీర్ పీక్ లో ఉండగానే ఓ హీరోను ప్రేమించిందని వార్తలు వచ్చాయి. ఆ ప్రేమ విఫలం అవ్వడంతో ఆమె డిప్రషన్ లోకి వెళ్లిందని.. ఈ క్రమంలోనే ఆమె బరువు పెరుగుపెరిగింది. బరువు తగ్గే క్రమంలోనే ఆమె కన్నుమూసింది. ఆమె మరణం ఎంతో మందికి బాధ కలిగించింది.

అబ్బో.. ఈ అమ్మడు మామూల్ది కాదు..! చేసింది 7 సినిమాలు ఆస్తిమాత్రం రూ. 700కోట్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కామికా ఏకాదశి ఎప్పుడు? ఈ వస్తువులు దానం చేస్తే ఐశ్వర్యం, శుభ..
కామికా ఏకాదశి ఎప్పుడు? ఈ వస్తువులు దానం చేస్తే ఐశ్వర్యం, శుభ..
ద్రవిడ్‌లాగే రహానేకు పెద్దగా గుర్తింపు దక్కలేదు: సునీల్ గవాస్కర్
ద్రవిడ్‌లాగే రహానేకు పెద్దగా గుర్తింపు దక్కలేదు: సునీల్ గవాస్కర్
నేతలే కాదు.. ఇప్పుడు వారసులూ!
నేతలే కాదు.. ఇప్పుడు వారసులూ!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లల్లో ప్రత్యేక రైళ్లు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లల్లో ప్రత్యేక రైళ్లు
అక్వా రైతులకు పండగే పండగ.. మళ్లీ మీసం మెలేస్తున్న బ్లాక్ టైగర్!
అక్వా రైతులకు పండగే పండగ.. మళ్లీ మీసం మెలేస్తున్న బ్లాక్ టైగర్!
ధోని ఎలాంటోడంటే.. రిటైర్మెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన రహానె
ధోని ఎలాంటోడంటే.. రిటైర్మెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన రహానె
శ్రీవారి హుండీకి ఒక్క నెల్లోనే రికార్డు ఆదాయం! ఎంతంటే..
శ్రీవారి హుండీకి ఒక్క నెల్లోనే రికార్డు ఆదాయం! ఎంతంటే..
స్నేహితుడు శత్రువైతే ఒక్క పని చేయండి.. ప్రేమానంద మహారాజ్ సలహా..
స్నేహితుడు శత్రువైతే ఒక్క పని చేయండి.. ప్రేమానంద మహారాజ్ సలహా..
750 ఎకరాల్లో రూ.6వేల కోట్లతో ప్రారంభమైన భారీ ప్రాజెక్ట్..
750 ఎకరాల్లో రూ.6వేల కోట్లతో ప్రారంభమైన భారీ ప్రాజెక్ట్..
రోహిత్ రిటైర్మెంట్‌పై కైఫ్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ రిటైర్మెంట్‌పై కైఫ్ సంచలన వ్యాఖ్యలు