AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోహన్ లాల్ సేంద్రీయ వ్యవసాయం

సినిమా నటీనటులు ఒకవైపు యాక్టింగ్ చేస్తూనే, ఖాళీ సమయాల్లో తమకు ఇష్టమైన వ్యాపకాలతో బిజీగా గడిపేస్తుంటారు. పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్ లాంటి నటులు వ్యవసాయం చేయడం, మొక్కలు చూశాం.

మోహన్ లాల్ సేంద్రీయ వ్యవసాయం
Ram Naramaneni
|

Updated on: Sep 26, 2020 | 7:08 PM

Share

సినిమా నటీనటులు ఒకవైపు యాక్టింగ్ చేస్తూనే, ఖాళీ సమయాల్లో తమకు ఇష్టమైన వ్యాపకాలతో బిజీగా గడిపేస్తుంటారు. పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్ లాంటి నటులు వ్యవసాయం చేయడం, మొక్కలు పెంచడం చూశాం. తాజాగా మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కూడా రైతుగా మారిపోయారు. ఆయన ప్రస్తుతం సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కరోనా లాక్ డౌన్ సమయంలో మోహన్ లాల్ తన ఇంట్లో సేంద్రీయ వ్యవసాయం చేయడం ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా అభిమానులతో పంచుకున్నారు. ఇలాంటి ఫోటోలు ఎంతోమందికి స్పూర్తిదాయకంగా నిలుస్తాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సినిమాల విషయానికి వస్తే.. రీసెంట్‌గా మోహన్‌లాల్‌ ‘దృశ్యం’ 2 సినిమా షూటింగ్‌ను స్టార్ట్‌ చేశారు. శనివారం నుంచి ఆయన ఈ చిత్ర షూటింగులో పాల్గొంటున్నారు. ఈ సినిమాకు జీతూ జోసఫ్ దర్శకత్వం వహిస్తుండగా వచ్చే ఏడాది ప్రారంభంలో చిత్రాన్ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది యూనిట్.

Also  Read :

ఈ సారి తిరుమల, తిరుపతి పోలీసులు బుక్కయ్యారు

వివేకా హత్య కేసు అప్డేట్ : ఆర్థిక లావాదేవీల కోణంలో సీబీఐ ఫోకస్

Follow Us