AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Gopal Varma: చావుకు మరో ఏడాది దగ్గరయ్యాను.. రామ్ గోపాల్ వర్మ షాకింగ్ పోస్ట్

సినిమాలు చేయకున్నా తరచూ తన కామెంట్స్, సోషల్ మీడియా పోస్టులతో వార్తల్లో నిలుస్తున్నారు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ముఖ్యంగా ఇటీవల ధురంధర్ 2 సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు ఆర్జీవీ. అయితే తాజాగా ఆయన చేసిన ఒక ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది.

Ram Gopal Varma: చావుకు మరో ఏడాది దగ్గరయ్యాను.. రామ్ గోపాల్ వర్మ షాకింగ్ పోస్ట్
Ram Gopal Varma
Basha Shek
|

Updated on: Apr 07, 2026 | 4:45 PM

Share

టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు శివ, రంగీలా, క్షణ క్షణం వంటి దేశం గర్వించదగ్గ సినిమాలు తీసిన ఆయన విలక్షణ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అదంతా గతంలా మారిపోయింది. ఇప్పుడు ఆయన సినిమాలపై పట్టు కోల్పోయారు. బయోపిక్స్, పోలిటికల్ స్టోరీలంటూ సినిమాలు తీయడం తప్ప విజయాలు అందుకోలేకపోతున్నారు. ఆర్జీవీ కమ్ బ్యాక్ ఇస్తే చూడాలని సందీప్ రెడ్డి వంగా లాంటి ప్రముఖులతో పాటు అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే సినిమాలు చేయకున్నా తరచూ తన కామెంట్స్, సోషల్ మీడియా పోస్టులతో వార్తల్లో ఉంటున్నారు రామ్ గోపాల్ వర్మ. ముఖ్యంగా ఇటీవల ధురంధర్ 2 సినిమాపై వరుసగా పోస్టులు పెడుతున్నారాయన. ఆ సినిమాను చూసి దర్శక నిర్మాతలు భయపడుతున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. వీటిపై చర్చ జరుగుతుండగానే సోషల్ మీడియాలో మరో షాకింగ్ పోస్ట్ పెట్టాడు ఆర్జీవీ.

భారతీయ సినిమా ఇండస్ట్రీలో విలక్షణ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ మంగళవారం (ఏప్రిల్ 7) మరో వసంతంలోకి అడుగు పెట్టారు. ఇవాళ ఆయన పుట్టిన రోజు కావడంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆర్జీవీకి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. మరో వైపు ఆర్జీవీ కూడా తన పుట్టిన రోజు సందర్భంగా ట్విట్టర్ (ఎక్స్) లో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు. తనదైన స్టైల్లో’ ఈ రోజు నేను నా చావుకు మరో ఏడాది దగ్గరయ్యానంటూ సెటైరికల్‌ పోస్ట్ చేశారు. అందువల్ల మీకు సంతోషం కలిగించే మరే ఇతర కారణాల కోసమైతే తప్ప.. ఈ రోజును వేడుకలా జరుపుకోవద్దు! ధన్యవాదాలు.. అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఆర్జీవీ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు ఆర్జీవీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

రామ్ గోపాల్ వర్మ ట్వీట్..

శర్వానంద్ బైకర్ సినిమాను చూడాలనుకుంటున్నా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..
రెండు జ్యోతిర్లింగాలతో పాటు దక్షిణ భారత పుణ్యక్షేత్రాల సందర్శన..
రెండు జ్యోతిర్లింగాలతో పాటు దక్షిణ భారత పుణ్యక్షేత్రాల సందర్శన..
సూర్యాస్తమయం తర్వాత ఈ 5 వస్తువులు అస్సలు కొనకూడదు! కారణం తెలిస్తే
సూర్యాస్తమయం తర్వాత ఈ 5 వస్తువులు అస్సలు కొనకూడదు! కారణం తెలిస్తే
షేర్ మార్కెట్లో లాభాలు కొందరికే ఎందుకు? నష్టాల వెనుక అసలు రహస్యం
షేర్ మార్కెట్లో లాభాలు కొందరికే ఎందుకు? నష్టాల వెనుక అసలు రహస్యం