విజయవాడ కనక దుర్గమ్మ వారదిపై ప్రయాణిస్తున్న స్కార్పియో కారులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో ప్రాణాపాయం తప్పింది. చూస్తుండగానే కారు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంతో ఫ్లైఓవర్‌పై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయి, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు.