చేప ముల్లు గొంతులో ఇరుక్కుందా ? వెంటనే ఇలా చేయండి.. ఒక్క సెకన్‌లోనే రిలీఫ్
చేపల్లో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. అందుకే.. నాన్ వెజ్ ప్రియులు ఇష్టంగా తింటారు. అయితే.. చేపలు తినేటప్పడు.. కొంతమంది చేప ముల్లు గొంతులో చిక్కుకుపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతారు.. ఈ చిన్న చేప ముళ్లను తొలగించడం చాలా కష్టంగా మారుతుంది. అయితే.. చేప ముల్లు గొంతులో చిక్కుకున్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు.. . దీనికోసం కొన్ని చిట్కాలతో గొంతుల్లో ఇరుక్కుపోయిన చేప ముళ్లను తొలగించవచ్చు..

నాన్ వెజ్ ప్రియులు చేపలను ఇష్టంగా తింటారు.. చేపలు తినడం వల్ల అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటిలో ఉండే పోషకాలు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. నాణ్యత కలిగిన ప్రోటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు విటమిన్ డి, బి2 వంటి ముఖ్యమైన పోషకాలకు చేపలు ప్రధాన మూలం.. అందుకే.. ఆరోగ్యానికి మేలు చేసే.. సూపర్‌ఫుడ్ చేపలు (Fish) తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే, చాలామంది చేపల్లో ఉండే ముళ్ళ వల్ల వాటిని తినడానికి భయపడతారు. ఎక్కడ గొంతులో ఇరుక్కుంటాయోనని ఆందోళన చెందుతారు. కానీ చేప ముల్లు గొంతులో చిక్కుకుంటే భయపడాల్సిన పని లేదు. కొన్ని సాధారణ చిట్కాలను పాటించి ఈ సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు.. కొన్ని పద్దతులను పాటిస్తే సెకన్లలోనే చేప ముల్లు బయటకు వస్తుంది.
ముఖ్యంగా, చేప ముల్లు నేరుగా జీర్ణాశయంలోకి వెళ్తే ఆందోళన అవసరం లేదు.. ఎందుకంటే జీర్ణాశయంలోని ఆమ్లాలు ముల్లును సులభంగా కరిగించేస్తాయి. ఒకవేళ గొంతులో చిక్కుకుంటే, ఈ కింది చిట్కాలను ప్రయత్నించండి..
- పొట్టపై ఒత్తిడి: గొంతులో ముల్లు చిక్కుకున్నప్పుడు పొట్టపై గట్టిగా నొక్కండి. దీనివల్ల గాలితో పాటు ముల్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది.
- వీపుపై ఒత్తిడి: ఒంగి వీపు మీద ఒత్తిడి కలిగించండి, నోరు తెరిచి ఉంచండి. దీంతో ముల్లు బయటకు వస్తుంది.
- పొడి అన్నం: కొద్దిగా పొడి అన్నాన్ని ముద్దలా చేసి నమలకుండా మింగాలి. వెంటనే ఒక గ్లాసు నీళ్లు తాగాలి. ఇది ముల్లును గొంతు లోపలికి తోస్తుంది.
- అరటిపండు: అరటిపండు సగాన్ని నోట్లో వేసుకుని నమలకుండా మింగాలి. తర్వాత కొద్దిగా నీళ్లు తాగితే ముల్లు కిందకు జారిపోతుంది.
- పల్లీలు లేదా బ్రౌన్ బ్రెడ్: గుప్పెడు పల్లీలను నమిలి, ఆపై నీళ్లు తాగాలి. లేదా పీనట్ బట్టర్ రాసిన బ్రౌన్ బ్రెడ్‌ను తిని నీళ్లు తాగడం వల్ల కూడా ముల్లు లోపలికి వెళ్తుంది.
- వెనిగర్ నీరు: ఒక గ్లాసు నీటిలో రెండు స్పూన్ల వెనిగర్ కలిపి, రెండు టీ స్పూన్ల మోతాదులో తాగాలి.
- కూల్ డ్రింక్స్/సోడా: వెంటనే సోడా తాగడం వల్ల అందులోని వాయువు ముల్లుపై ఒత్తిడి తెచ్చి బయటకు వచ్చేలా చేస్తుంది.
- ఆలివ్ ఆయిల్: రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ నేరుగా తాగడం వల్ల ముల్లు జారుడుగా జీర్ణాశయంలోకి వెళ్తుంది.
- దగ్గడం: గొంతులో ముల్లు ఇరుక్కోగానే నాలుగైదు సార్లు గట్టిగా దగ్గితే ముల్లు బయటకు వచ్చే అవకాశం ఉంది.
- నిమ్మరసం, ఉప్పు: రెండు టీ స్పూన్ల నిమ్మరసంలో కొద్దిగా ఉప్పు కలిపి తీసుకోవడం వల్ల కూడా ముల్లు బయటకు వస్తుంది.
చేపలు తినేటప్పుడు నెమ్మదిగా, జాగ్రత్తగా, కంగారు పడకుండా ఉండాలి. ముళ్ళు లేని చేపలను ఎంచుకోవడం లేదా చేప ముక్కలను వేరే ప్లేట్‌లో పెట్టుకుని ముళ్ళు తీసివేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఎంత ప్రయత్నించినా ముల్లు బయటకు రాకపోతే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
