డ్రగ్స్ కేసు: మీడియా కథనాలపై కరణ్​ ఆవేదన

బాలీవుడ్​ యువ హీరో సుశాంత్ సింగ్​ రాజ్​పుత్​ మరణం ఇప్పుడు అన్ని చిత్ర పరిశ్రమలను ఒక ఊపు ఊపేస్తుంది. సుశాంత్ కేసు విచారణలో భాగంగా నెపోటిజం, డ్రగ్స్ కోణాలపై దర్యాప్తు అధికారులు ఫోకస్ పెట్టారు.

డ్రగ్స్ కేసు: మీడియా కథనాలపై కరణ్​ ఆవేదన
Follow us

|

Updated on: Sep 26, 2020 | 6:50 PM

బాలీవుడ్​ యువ హీరో సుశాంత్ సింగ్​ రాజ్​పుత్​ మరణం ఇప్పుడు అన్ని చిత్ర పరిశ్రమలను ఒక ఊపు ఊపేస్తుంది. సుశాంత్ కేసు విచారణలో భాగంగా నెపోటిజం, డ్రగ్స్ కోణాలపై దర్యాప్తు అధికారులు ఫోకస్ పెట్టారు. సుశాంత్ చనిపోయినప్పటి నుంచి ప్రముఖ నిర్మాత కరణ్​ జోహర్​పై నెటిజన్లు, ఒక వర్గం మీడియా విమర్శలతో విరుచుకుపడుతోంది. అతడు నెపోటిజాన్ని ఎంకరేజ్ చేస్తాడంటూ ఆరోపణలు వచ్చాయి. కాగా ఇప్పుడు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తు చేస్తున్న సంచలనాత్మక డ్రగ్స్ కేసుకు సంబంధించి.. కరణ్​పై కొద్దిరోజులుగా పలు మీడియా సంస్థలు వరుస కథనాలు ప్రసారం చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే తనపై వస్తున్న మీడియా కథనాలను ఖండిస్తూ.. సోషల్ మీడియా​ వేదికగా ఓ నోట్​ పోస్ట్​ చేశాడు కరణ్​. ఇందులో గతేడాది తన ఇంట్లో నిర్వహించిన వివాదాస్పద పార్టీ గురించి స్పందించాడు. ఆ కార్యక్రమంలో ఎటువంటి డ్రగ్స్ తీసుకోలేదని.. వాటిని ప్రోత్సహించడం తన వృత్తి కాదని వెల్లడించాడు. ధర్మా ప్రొడక్షన్స్ ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్​ ప్రసాద్​, అనుభవ్​ చోప్రాలను ఎన్​సీబీ విచారిస్తుండగా.. వారితో తనకు వ్యక్తిగతంగా ఎటువంటి సంబంధం లేదని కరణ్​ వివరించాడు. కొంతమంది వ్యక్తులు తమ వ్యక్తిగత జీవితాల్లో చేసే పనులకు తాను బాధ్యత వహించలేనని రాసుకొచ్చాడు.

డ్రగ్స్ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన ఎన్సీబీ తాజాగా ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ప్రధాన అనుచరుడు క్షితిజ్‌ ప్రసాద్‌ని అదుపులోకి తీసుకుంది. కాగా కరణ్ జోహార్‌కి చెందిన ధర్మ ప్రొడక్షన్‌లో క్షితిజ్‌ ఎగ్జిగ్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. కరణ్‌కి ప్రధాన అనుచరుడిగా ఇతడికి పేరుంది.

Also Read :

కుండపోత వర్షంలోనూ విధులే ముఖ్యం, ఈ పోలీసన్నకు సెల్యూట్

IPL 2020 : రాయుడు వస్తే అంతా సర్దుకుంటుంది: ధోనీ