అన్నమయ్య జిల్లాలోని బోయకొండ గంగమ్మ ఆలయం వద్ద ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధం కారణంగా భార్య రఫాతి పక్కా ప్లాన్ ప్రకారం ముగ్గురు వ్యక్తులతో కలిసి గాంధీని హతమార్చింది. ఈ ఘటన సమయంలో ఐదేళ్ల కుమారుడు సందీప్ అక్కడే ఉన్నాడు. తండ్రి నిద్రపోతున్నాడని భావించి రాత్రంతా శవం వద్దే ఉన్నాడు. సోమవారం ఉదయం ఆకలితో ఏడుస్తున్న చిన్నారిని గుర్తించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు విచారణ చేపట్టారు.