Balagam: మొత్తానికి ఏడిపించావు కదయ్యా వేణు.. ‘బలగం’ సినిమా చూస్తూ ఊరంతా కన్నీరు పెట్టింది..
చావు చుట్టూ అల్లుకున్న కథ.. చావు చెప్పిన మానవ బంధాల కథ.. భావోద్వేగాలతో మనసులను తాకిన కథ.. అదే 'బలగం'. ఓ 20 ఏళ్ల క్రితం వరకూ సినిమా చూసేందుకు ఊరంతా ఒకదగ్గర చేరేది. ఇప్పుడు అదే సన్నివేశాలను మరోసారి కళ్లముందుకు తీసుకువచ్చింది ఈ బలగం సినిమా.

పెద్ద పెద్ద హీరోలు లేరు.. అలాగని బ్లాక్ బస్టర్స్ రూపొందించిన దర్శకుడు కాదు.. కానీ సినిమా చూసేందుకు థియేటర్లకు క్యూ కట్టారు జనాలు. మాస్ యాక్షన్ ఫైట్స్ లేవు.. గ్లామర్ షోతో పాటలు లేవు అయినా ప్రజలు మెచ్చారు.. చిన్న సినిమా ఇప్పుడు పెద్ద విజయాన్ని అందుకుంది. చాన్నాళ్ల తర్వాత మరోసారి మట్టి మనుషుల మనసులను హత్తుకునే సినిమా వచ్చింది. ఆ చిత్రంలో నటించిన నటీనటులు అప్పటివరకు వెండితెరపై అంతగా గుర్తింపు లేనివారే. కానీ తమ నటనతో జనాలను కన్నీళ్లు పెట్టించారు. చావు చుట్టూ అల్లుకున్న కథ.. చావు చెప్పిన మానవ బంధాల కథ.. భావోద్వేగాలతో మనసులను తాకిన కథ.. అదే ‘బలగం‘. ఓ 20 ఏళ్ల క్రితం వరకూ సినిమా చూసేందుకు ఊరంతా ఒకదగ్గర చేరేది. ఇప్పుడు అదే సన్నివేశాలను మరోసారి కళ్లముందుకు తీసుకువచ్చింది ఈ బలగం సినిమా. ఇన్నాళ్లు తన కామెడితో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వేణు యెల్దండి.. మొదటిసారి మెగా ఫోన్ పట్టి ప్రేక్షకుల కంట కన్నీరు పెట్టించాడు. అన్ని వర్గాల సినీ ప్రియులను ఆకట్టుకునే చిత్రాన్ని రూపొందించాడు. అందరితోనూ శభాష్ అనిపించుకుంటున్నాడు.
డైరెక్టర్ వేణి దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రం బలగం. ఇది మొదటి సినిమానే అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా అద్భుతంగా తెరకెక్కించాడు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను అందరికీ కనెక్ట్ అయ్యేలా ఆవిష్కరించాడు. ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ తోపాటు.. ఒకరిద్దరూ మాత్రమే తెలిసిన నటీనటులు ఉన్నారు. మిగతా అందరూ కొత్తవాళ్లే. అయిన తమ నటనతో మెప్పించారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే పాట.. పాత్రల నటన.. అందరినీ కంటతడి పెట్టించింది.




ఇక ఈ సినిమాను గ్రామాల్లో పెద్ద స్క్రీన్ పై ప్రదర్శిస్తున్నారు. గ్రామ పంచాయతీల ముందు.. ఆయా గ్రామాల కూడళ్ల ముందు పెద్ద పెద్ద స్క్రీన్ ల సాయంతో బలగం సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ గ్రామంలో బలగం సినిమా చూస్తూ కన్నీరు పెట్టుకున్నారు. చిన్నా, పెద్ద..మహిళలు, పురుషులు, వృద్ధులు అంతా ఏడ్చాసారు. మహిళలు చీరకొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ సినిమాను చూస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ తన ట్వీట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. జనాల్లోకి బాహుబలి కన్నా ఎక్కువ సొచ్చుకుపోయింది బలగం ఇప్పట్లో ఆగేలా లేదు అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ ట్వీట్ కు హీరో ప్రియదర్శి స్పందిస్తూ.. ఇది నా సినిమానా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే భావోద్వేగ ఎమోజీ షేర్ చేశారు. ప్రస్తుతం వీడియో వైరలవ్వగా.. నెటిజన్స్ స్పందిస్తూన్నారు. ఓవైపు ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ థియేటర్లలో చూసేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
Idhi naa cinema na?#Balagam https://t.co/yStQ4EaZly
— Sailu Priyadarshi #Balagam (@priyadarshi_i) April 2, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




