Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బ్రో సినిమా క్రేజ్.. భారీ ధరకు ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ

ఈ క్రేజీ కాంబో కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విలక్షణ నటుడు సాముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్ ను రీసెంట్ గా రివీల్ చేశారు. ఈ సినిమాకు బ్రో అనే టైటిల్ ను ఖరారు చేశారు.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బ్రో సినిమా క్రేజ్.. భారీ ధరకు ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ
BRO Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: May 20, 2023 | 7:47 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ బ్రో. తమిళ్ సినిమా అయిన వినోదయ సిత్తం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా లో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నారు. ఈ క్రేజీ కాంబో కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విలక్షణ నటుడు సాముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్ ను రీసెంట్ గా రివీల్ చేశారు. ఈ సినిమాకు బ్రో అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ మూవీ మోషన్ పోస్టర్ రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే మిలియన్ల కొద్దీ వ్యూస్.. లక్షల్లో లైక్స్ వచ్చాయి ఈ మోషన్ పోస్టర్ కు.. ఇక ఈ సినిమాలో పవన్ దేవుడిగా కనిపించనున్నారు. గతంలో వచ్చిన గోపాల గోపాల ఇనిమలో పవన్ కృష్ణుడిగా కనిపించిన విషయం తెలిసిందే..

సాముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లేఅందిస్తున్నారు . తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ సినిమా కథలో చాలా మార్పులు చేశారు. మన ఆడియన్స్ కు కావాల్సిన ఎలివేషన్స్ తో పాటు చాలా మార్పులు చేశారు ఈ సినిమాలో.. ఇదిలా ఉంటే ఈ మూవీ ఓటీటీ హక్కులకు సంబందించిన ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

బ్రో సినిమా ఓటీటీ రేట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ బ్రో సినిమాను పీపుల్స్ మీడియా బ్యానర్ తో కలిసి జీ స్టూడియోస్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిజిటల్ హక్కులను మాత్రం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఫ్యాన్సీ రేటుకు బ్రో మూవీ ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. బ్రో మూవీ జులై నెలాఖరున థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే