Bheemla Nayak : భీమ్లానాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. గెస్ట్ ఎవరంటే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ భీమ్లానాయక్. ఈ సినిమాకోసం పవన్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ భీమ్లానాయక్. ఈ సినిమాకోసం పవన్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దగ్గుబాటి యంగ్ హీరో రానా కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యపనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు స్టార్ దర్శకుడు త్రివిక్రమ్. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో రానా పవన్ పోటీపోటీగా నటించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది ఈ సినిమా. ఫిబ్రవరి 25న తెలుగు, హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది భీమ్ల నాయక్.
ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటం తో ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రయూనిట్. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను 21న గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో అభిమానులలో మరింత క్యూరియాసిటీ పెరిగిపోతుంది. భీమ్లా నాయక్ గురించి ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ట్రైలర్ను నేడు (ఫిబ్రవరి 19న) రిలీజ్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్. మరి ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :