OG Movie Teaser: రికార్డ్ క్రియాట్ చేసిన ఓజీ టీజర్.. పవన్ ఫ్యాన్స్ అంటే మాములుగా ఉండదు మరి..
ముఖ్యంగా ఓజీ టీజర్ ఇన్‌స్టాంట్‌గా వైరల్ కావటంతో గత రికార్డులు తిరగరాశారు పవన్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ సినిమా అంటే మాములుగా ఉండదు మరి అంటున్నారు అభిమానులు. కేవలం 24 గంటల పాటు సోషల్ మీడియాలో పవన్ మేనియా ఓ రేంజ్‌లో కనిపించింది. వరుస అప్‌డేట్స్ రావటంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఆల్రెడీ కోల్డ్ స్టోరేజ్‌లోకి వెళ్లిపోయిందన్న అనుమానాలున్న హరి హర వీరమల్లు టీమ్ కూడా కొత్త పోస్టర్ ఇవ్వటంతో అభిమానుల్లో ఆ జోష్ గట్టిగా కనిపించింది.

పవన్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా మోత మోగిపోయింది. మిడ్ నైట్ నుంచి అప్‌డేట్స్ షురూ కావటంతో ఆన్‌లైన్‌లో సందడి గట్టిగా కనిపించింది. ముఖ్యంగా ఓజీ టీజర్ ఇన్‌స్టాంట్‌గా వైరల్ కావటంతో గత రికార్డులు తిరగరాశారు పవన్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ సినిమా అంటే మాములుగా ఉండదు మరి అంటున్నారు అభిమానులు. కేవలం 24 గంటల పాటు సోషల్ మీడియాలో పవన్ మేనియా ఓ రేంజ్‌లో కనిపించింది. వరుస అప్‌డేట్స్ రావటంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఆల్రెడీ కోల్డ్ స్టోరేజ్‌లోకి వెళ్లిపోయిందన్న అనుమానాలున్న హరి హర వీరమల్లు టీమ్ కూడా కొత్త పోస్టర్ ఇవ్వటంతో అభిమానుల్లో ఆ జోష్ గట్టిగా కనిపించింది.
జస్ట్ పోస్టర్ రిలీజ్ చేసినా.. ఉస్తాద్ భగత్ సింగ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ కూడా నెక్ట్స్ లెవల్‌లో కనిపించింది. ఆ రోజు ఉదయం నుంచి ఉస్తాద్ హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండింగ్‌లో కనిపించింది. ఇక పోస్టర్ రిలీజ్ తరువాత ఆ ట్రెండ్స్ పీక్స్‌కు చేరాయి. ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆ పోస్టర్ ను షేర్ చేశారు.
The RAGE of #HUNGRYCHEETAH is OUT NOW 🔥💥🐆#TheyCallHimOG
Vinandi… Enjoy 🔥🔥🔥
🔗🎶 https://t.co/SCBrfXfxHm pic.twitter.com/VCsXFBE8lw
— DVV Entertainment (@DVVMovies) September 3, 2023
శనివారం సోషల్ మీడియాను షేక్ చేసిన అసలు అప్‌డేట్ ఓజీ టీజర్ అనే చెప్పాలి. పవన్‌ను వింటేజ్ లుక్‌లో ప్రజెంట్ చేస్తూ సుజిత్ కట్ చేసిన టీజర్ పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చింది. ఫస్ట్ టీజర్‌తోనే బ్లాక్ బస్టర్ పక్కా అన్న కాన్ఫిడెన్స్ వచ్చేయటంతో సోషల్ మీడియాలోనూ అదే జోరు కనిపించింది. ఈ మూవీతో పవన్ ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారా అలా సుజిత్ చుపిస్తారన్న నమ్మకం క్రియేట్ అయ్యింది.
🔥🥵🔥🥵🔥🥵 pic.twitter.com/mPR3sNS0fb
— ٰ (@Herbb69) September 3, 2023
యూట్యూబ్‌లోనే తొలి 24 గంటల్లో 18 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన ఓజీ టీజర్, అన్ని ప్లాట్ ఫామ్స్‌లో కలిపి 25 మిలియన్ల మార్క్‌ను క్రాస్ చేసిందన్న అంచనాలు ఉన్నాయి. హ్యాష్ ట్యాగ్ ట్రెండ్స్‌లోనూ ఓజీ ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసిందంటున్నారు ఫ్యాన్స్. టీజర్‌తోనే ఈ రేంజ్ విధ్వంసం అంటే సినిమా రిలీజ్ అయితే ఆ లెక్క మరో లెవల్ లో ఉంటుందంఅంటున్నారు క్రిటిక్స్.
🔥🔥🔥🔥🔥🔥 massss pic.twitter.com/cZr7DgL7mC
— 🦅S A I T E J A 🦁Kalyan Cult🦁 (@Pspkdevoties) September 3, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..




