Pawan Kalyan: గబ్బర్ సింగ్ విషయంలో అలా జరిగింది.. రెమ్యునరేషన్ గురించి పవన్ ఏమన్నారంటే

బాలీవుడ్ దబాంగ్ సినిమాను రీమేక్ చేశారు దర్శకుడు హరీష్ శంకర్. తెలుగు నేటివిటీకి, పవన్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఈ సినిమా కథలో మార్పులు చేర్పులు చేశారు హరీష్. 2011 మే 11న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది గబ్బర్ సింగ్.

Pawan Kalyan: గబ్బర్ సింగ్ విషయంలో అలా జరిగింది.. రెమ్యునరేషన్ గురించి పవన్ ఏమన్నారంటే
Pawan Kalyan
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 06, 2023 | 6:52 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే.. పవన్ కెరీర్ లో ఖుషి సినిమా తర్వాత భారీ హిట్ అందుకున్న సినిమా ఇది. బాలీవుడ్ దబాంగ్ సినిమాను రీమేక్ చేశారు దర్శకుడు హరీష్ శంకర్. తెలుగు నేటివిటీకి, పవన్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఈ సినిమా కథలో మార్పులు చేర్పులు చేశారు హరీష్. 2011 మే 11న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది గబ్బర్ సింగ్. ఈ సినిమాలో పవన్ కు జోడీగా అందాల భామ శ్రుతిహాసన్ నటించింది. ఇక రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. అప్పట్లోనే ఈ మూవీ రూ. 150 కోట్లు వసూల్ చేసి రికార్డు సృష్టించింది. తాజాగా బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 2 యూ హాజరైన పవన్ కళ్యాణ్ ఈ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

నిర్మాత బండ్లగణేష్ గురించి పవన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ దెబ్బకు అన్ స్టాపబుల్ షో ఓ రేంజ్ లో రేటింగ్ అందుకుంది. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా ప్రేక్షకులకు అందించనున్నారు ఆహా టీమ్. ఈ క్రమంలోనే మొదటి పార్ట్ ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది.

కాగా ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..గబ్బర్ సింగ్ మూవీ రెమ్యునరేషన్ గురించి మాట్లాడారు. బాలయ్య గబ్బర్ సింగ్ సినిమాకు రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు.? అని ప్రశ్నించగా.. పాపం తాను అనుకున్నంత ఇచ్చాడు .. నేను అనుకున్నంత ఇవ్వలేదు అని నవ్వుతూ సమాధానం చెప్పారు. దీని పై బండ్లగణేష్ ట్వీట్ చేస్తూ..  ‘‘లవ్ యు బాస్ పవన్ కళ్యాణ్.. అన్‌కండీషనల్ లవ్’’ అంటూ రాసుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..