Pawan Kalyan: పవర్ స్టార్ వింటేజ్ లుక్‌కు ఫిదా కానివారు ఉండరేమో.. సోషల్ మీడియా షేక్ అయిపోతుందిగా..!
ఈ క్రమంలోనే క్రిష్ దర్శకత్వంలో హరిహర వీర మల్లు అనే హిస్టారికార్ మూవీ చేస్తున్నారు పవర్ స్టార్. ఈ సినిమా ఎప్పుడో మొదలైనప్పటికీ పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో వాయిదా పడుతూ వచ్చింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహరవీర మల్లు. ఒక వైవు రాజకీయాలతో మరో వైపు సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు పవన్. ఈ క్రమంలోనే క్రిష్ దర్శకత్వంలో హరిహర వీర మల్లు అనే హిస్టారికార్ మూవీ చేస్తున్నారు పవర్ స్టార్. ఈ సినిమా ఎప్పుడో మొదలైనప్పటికీ పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ స్పీడ్ అందుకుంది. ప్రియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన టైటిల్ పోస్టర్, పవన్ లుక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక మొన్నామధ్య విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కోసం పవన్ ప్రత్యేక కసరత్తులు చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమాకోసం పవన్ శిక్షణ తీసుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా పవన్ పాక్టీస్ చేస్తోన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే భీమ్లానాయక్ సినిమా తర్వాత రాజకీయాల్లో బిజీ అయ్యారు పవన్. అయితే చాలా రోజుల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రానున్నాడు పవన్ కల్యాణ్ ఏం చేస్తాడు అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ న్యూ లుక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘జానీ’ ఇంటెన్స్ లుక్స్ ఎంత క్రేజ్ తెచ్చుకున్నాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత పవన్‌ను అదే లుక్‌లో కనిపించారు. దాంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.
ఇక హరిహర వీర మల్లు సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. అర్జున్ రామ్‌పాల్, నర్గీస్ ఫక్రి వంటి బాలీవుడ్ తారలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ఈ సినిమను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం, దయాకర్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, మలయాళం, తమిళ్ భాషల్లో విడుదల చేయనున్నారు.





Power Star Pawan Kalyan