Nandamuri Kalyan Ram: మరోసారి యాక్షన్ ఎంటర్టైనర్‌తో రానున్న నందమూరి హీరో.. డైరెక్టర్ ఎవరంటే

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ హిట్ మాత్రం పడలేదు. అయితే రీసెంట్ గా వచ్చిన బింబిసారా సినిమా మాత్రం కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచింది.

Nandamuri Kalyan Ram: మరోసారి యాక్షన్ ఎంటర్టైనర్‌తో రానున్న నందమూరి హీరో.. డైరెక్టర్ ఎవరంటే
Kalyan Ram
Follow us

|

Updated on: Oct 11, 2022 | 7:32 PM

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ చాలా కాలంగా సాలిడ్ హిట్ కొట్టాడని ప్రయత్నిస్తున్నారు. అప్పుడెప్పుడో అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన పటాస్ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ మంచి హిట్ అందుకోలేకపోయారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ హిట్ మాత్రం పడలేదు. అయితే రీసెంట్ గా వచ్చిన బింబిసారా సినిమా మాత్రం కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచింది. ముందు నుంచి ఈ సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తిని క్రియేట్ చేస్తూ వచ్చిన ఈ మూవీ.. ఆగస్ట్ 5న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. ఈ సినిమాతో వశిష్ట నూతన దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమ్యాడు. మొదటి సినిమాతోనే పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వశిష్ట. ఇందులో భీమ్లా నాయక్ బ్యూటీ సంయుక్త మీనన్.. కేథరిన్ కీలకపాత్రలలో నటించారు. అంతేకాకుండా కళ్యాణ్ రామ్ కెరీర్‏లోనే అత్యంత ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో సందడి చేయనుంది. ఈ క్రమంలోనే మరో సినిమాను కూడా పట్టాలెక్కించారు కళ్యాణ్ రామ్.

క‌ళ్యాణ్ రామ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. నందమూరి కళ్యాణ్ రామ్ 19వ చిత్రమిది. రాజేంద్ర రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రాన్ని న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్ నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న ఆషిక రంగ‌నాథ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. రీసెంట్‌గా జరిగిన గోవా షెడ్యూల్‌తో దాదాపు సినిమా షూటింగ్  పూర్తయ్యిందని తెలుస్తోంది. చివరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. జిబ్రాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎస్‌.సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేశారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. అయితే బింబిసార సినిమా హిట్ అవ్వడంతో ఇప్పుడు ఈ సినిమా పై నందమూరి అభిమానుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో