Unstoppable with NBK season 2: అన్ స్టాపబుల్ ప్రోమో అదుర్స్.. బావను ఆటపట్టించిన బాలయ్య.. చంద్రబాబు కూడా తగ్గలేదుగా..
తనదైన మాటలతో, పంచ్ లతో వచ్చిన గెస్ట్ లను తికమకపెడుతూ ఎంతో సరదాగా సాగింది అన్ స్టాపబుల్ సీజన్ వన్. టాక్ షోలన్నింటిలోనూ అన్ స్టాపబులే నెంబర్ వన్ ఉండేలా నిలబెట్టారు బాలకృష్ణ.
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తోన్న అన్ స్టాపబుల్ గురించి ఎంత చెప్పిన తక్కువే.. బాలయ్య తన స్టైల్ లో ఈ షోను ఇండియాలోనే నెంబర్ వన్ గా నిలిపారు. తనదైన మాటలతో, పంచ్ లతో వచ్చిన గెస్ట్ లను తికమకపెడుతూ ఎంతో సరదాగా సాగింది అన్ స్టాపబుల్ సీజన్ వన్. టాక్ షోలన్నింటిలోనూ అన్ స్టాపబులే నెంబర్ వన్ ఉండేలా నిలబెట్టారు బాలకృష్ణ. సూపర్ స్టార్ మహేష్ బాబు, నేచురల్ స్టార్ నాని, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ మహారాజ రవితేజ ఇలా పలువురు స్టార్స్ తో తన మాటలతో.. సరదా సంభాషణలతో ఆకట్టుకున్నారు బాలకృష్ణ. మొదటి సీజన్ ను ఘనవిజయంగా పూర్తి చేసిన ఆహా. ఇప్పుడు సీజన్ 2 తో రావడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే ఘనంగా సీజన్ 2 ను ప్రారంభించింది. సినిమా ప్రీరిలీజ్ ను తలపించేలా సీజన్ 2 ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
తాజాగా అన్ స్టాపబుల్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేశారు. బాలయ్య షో కు మొదటి గెస్ట్ గా తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు బాలయ్యకు బావ అన్న విషయం తెలిసిందే. అలాగే వియ్యంకుడు కూడా బాలకృష్ణ కుమార్తె బ్రహ్మీని ని నారా లోకేష్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ బావ బామ్మర్దులు టాక్ షోలో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ప్రోమో చూస్తుంటేనే ఈ ఎపిసోడ్ ఎంత సరదాగా సాగిందో అర్ధమవుతోంది. ఇక ఈ ప్రోమోలో బాలయ్య మీ బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్పండి అని చంద్రబాబు ను అడగ్గా నేను రాజశేఖర్ రెడ్డి కలిసి బాగా తిరిగాం అని సమాధానం ఇచ్చారు చంద్రబాబు. అలాగే కొన్ని విషయాల్లో బాలయ్యపైనే పంచులు కూడా వేశారు చంద్రబాబు.
అలాగే ఈ ఎపిసోడ్ లో నారా లోకేష్ కూడా హాజరయ్యారు. ఇక లోకేష్ మామతో కలిసి సందడి చేయడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే బాలయ్య మా చెల్లిని ఏమని పిలుస్తారు బావా మీరు అని అడగ్గా భూ అని పిలుస్తా అని అన్నారు చంద్రబాబు. అలాగే మా చెల్లికి మా అందరి ముందు ఐ లవ్ యూ చెప్పాలి అని బాలయ్య అడిగితే చంద్రబాబు.. ఆయన భార్యకు ఫోన్ చేసి మీ బాలకృష్ణ గారి చేతిలో ఇరుక్కుపోయా అని నవ్వులు పూయించారు. మొత్తంగా ఈ ప్రోమో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ ఎపిసోడ్ ఈ నెల 14న టెలికాస్ట్ అవ్వనుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.