AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: మీ హీరో పవన్ కళ్యాణ్‌గా మాట్లాడుతున్నా.. ‘హరి హర వీరమల్లు’ గొప్ప చిత్రం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహరవీరమల్లు సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం పవన్ అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. హరిహరవీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు మొదట క్రిష్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఈ సినిమా నుంచి క్రిష్ తప్పుకోవడంతో జ్యోతికృష్ణ దర్శకత్వ బాధత్యలు తీసుకున్నారు.

Pawan Kalyan: మీ హీరో పవన్ కళ్యాణ్‌గా మాట్లాడుతున్నా.. 'హరి హర వీరమల్లు' గొప్ప చిత్రం
Pawan Kalyan
Rajeev Rayala
|

Updated on: Jul 23, 2025 | 8:42 PM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. జూలై 24న విడుదలవుతోన్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు, పాటలకు విశేష స్పందన లభించింది. జూలై 23(బుధవారం) సాయంత్రం వైజాగ్ లో చిత్రం బృందం ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. అభిమానుల కోలాహలం నడుమ వైభవంగా జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు.

ఇది కూడా చదవండి : బెడిసికొట్టిన సర్జరీ.. గుర్తుపట్టలేనంతగా మారిన నటి.. తిట్టిపోస్తున్న నెటిజన్స్

ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “వైజాగ్ అనేది నా హృదయానికి దగ్గరగా ఉండే ఊరు. నేనొక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని కదా.. రకరకాల ఊళ్ళకు ట్రాన్స్ ఫర్ లు అవుతాయి. అందుకే ఎన్నో ఊళ్ళతో నాకు అనుబంధం ఉంటుంది. నేను అప్పుడు పెద్దగా ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాడిని. ఆ సమయంలో అన్నయ్య చిరంజీవి గారు నన్ను సత్యానంద్ గారి దగ్గర నటనలో శిక్షణ కోసం విశాఖపట్నం పంపించారు. అలా విశాఖతో నాకు పరిచయం. ఉత్తరాంధ్ర ఆట పాటను సత్యానంద్ గారు నా గుండెల్లో అణువణువునా నింపారు. అలాగే గత ప్రభుత్వం నన్ను విశాఖలో అరెస్ట్ చేసి, ఇబ్బంది పెట్టాలని చూస్తే.. ఇక్కడి ప్రజలు నాకు అండగా నిలబడ్డారు. అందుకే విశాఖలో ఈ ఈవెంట్ నిర్వహించాలి అనుకున్నాను.

ఇది కూడా చదవండి : ఎలాంటి అమ్మాయి ఎలా మార్చేశారా..! నటనతో పిచ్చెక్కించిన ఈ భామ ఎవరో తెలుసా..?

నేను ఈరోజు ఉపముఖ్యమంత్రిగా కాకుండా, మీ హీరో పవన్ కళ్యాణ్ గానే మాట్లాడతాను. గత ప్రభుత్వంలో అందరి హీరోల సినిమాలకు రూ.100-150 టికెట్ రేట్లు ఉంటే.. నా సినిమాకి మాత్రం రూ.10-15 ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా భీమ్లా నాయక్ సినిమాకి విజయాన్ని అందించిన మీకు ఈ సభాముఖంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరి సినిమాలతో పాటు నా సినిమాకి కూడా టికెట్ రేట్ల పెంపుకి అవకాశం లభించింది. ఈ సందర్భంగా చంద్రబాబు గారికి కృతఙ్ఞతలు. సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేసిన నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. నెల రోజులుగా సినిమా ప్రమోషన్ బాధ్యతను తీసుకున్న నిధి అగర్వాల్ గారికి నా అభినందనలు. నేను ప్రమోషన్స్ లో పెద్దగా పాల్గొనను. నా సినిమా చూడండి అని అడగటం నాకు ఇబ్బందిగా ఉంటుంది. నాకు ఇవ్వడమే తెలుసు కానీ, అడగటం తెలీదు. అలాంటి నిధిని చూసి ఈ సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చాను.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తల్లైంది.. రెండు సార్లు విడాకులు.. చివరకు ఇప్పుడు ఇలా

చిన్నప్పటి నుంచి నాకు పెద్దగా కోరికలు లేవు. హీరో అవ్వాలి, డబ్బు సంపాదించాలని ఎప్పుడూ అనుకోలేదు. అన్యాయాన్ని ఎదిరించాలి, సాయం చేయాలి అనే ఆలోచనలు తప్ప వేరే ఏమీ ఉండేవి కావు. అలాంటి నన్ను సత్యానంద్ గారి దగ్గరకు పంపారు అన్నయ్య చిరంజీవి గారు. అప్పుడు నేను బాగా సిగ్గుపడే వాడిని. అలాంటి నేను నటన కంటే ముందు.. సత్యానంద్ గారి నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నాను. మా అన్నయ్య, వదినల నమ్మకమే నన్ను ఇంతాడివాడ్ని చేసింది. ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ తీసిన ఏఎం రత్నం గారు నాతో పెద్ద సినిమా తీయాలనే కోరికతో క్రిష్ గారితో ఈ సినిమా కథ చెప్పించారు. కరోనా మరియు రాజకీయ పరిస్థితుల కారణంగా ఈ చిత్రం ఆలస్యమైంది. నేను ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. పాలన పరంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా సమయాన్ని కేటాయించి షూటింగ్ పూర్తి చేశాను. ఈ సినిమాకి మూల కారణం క్రిష్ గారు. కొన్ని కారణాల వల్ల ఆయన సినిమాని పూర్తి చేయలేకపోయారు. రత్నం గారి కుమారుడు జ్యోతికృష్ణ గారు దర్శకత్వ బాధ్యతలు తీసుకొని.. తక్కువ కాలంలో ఎఫెక్టివ్ గా సినిమాని పూర్తి చేశారు. క్రిష్ గారి కథకి మార్పులు చేర్పులు చేసి.. విపరీతమైన శ్రమలో ఈ సినిమాని కంప్లీట్ చేశారు. రికార్డుల గురించి నేనెప్పుడూ మాట్లాడను. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. కీరవాణి గారు లేకపోతే హరి హర వీరమల్లు లేదు. మాకంటే ఈ సినిమాని ఎక్కువగా నమ్మారు. సినిమాని తన సంగీతంతో మరోస్థాయికి తీసుకెళ్ళారు. నాటు నాటు పాటతో కీరవాణి గారు ఆస్కార్ తీసుకురావడం మనందరం గర్వించదగ్గ విషయం. సినిమా అనేది వినోదంతో పాటు, విజ్ఞానం అందించాలనేది నేను నమ్ముతాను. కోహినూర్ వజ్రం నేపథ్యంలో సాగే ఈ కథలో సనాతన ధర్మం గురించి ఉంటుంది. నాకు తెలిసిన మార్షల్ ఆర్ట్స్ ఈ సినిమాకి ఉపయోగపడ్డాయి. అభిమానుల కోసం గబ్బర్ సింగ్ లాంటి భారీ విజయాన్ని ఇవ్వమని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.” అన్నారు.

సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి మాట్లాడుతూ, “ఎవరైనా ఒక మాట చెప్పినప్పుడు బల్లగుద్ది చెప్తున్నా అంటారు. ఈ వేదికగా నేను బల్లగుద్ది చెప్తున్నాను. హరి హర వీరమల్లుతో పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు పండుగ రాబోతుంది.” అన్నారు. చిత్ర కథానాయిక నిధి అగర్వాల్ మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ గారికి నేను వీరాభిమానిని. ఆయనతో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా కోసం మేమందరం ఎంతో కష్టపడి పనిచేశాం. రత్నం గారు లేకుండా ఈ సినిమా లేదు. జ్యోతికృష్ణ గారు ఎంతో కష్టపడ్డారు. కీరవాణి గారు అద్భుతమైన సంగీతం అందించారు. మీ అందరికీ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను.” అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..