Hari Hara Veera Mallu: వీరమల్లు వచ్చేస్తున్నాడు.. పవన్ సినిమా రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన

|

Mar 14, 2025 | 11:14 AM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం హరి హర వీర మల్లు. ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకొంటోన్న ఈ చిత్రం ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో వీరమల్లు రిలీజ్ వాయిదా పడింది.

Hari Hara Veera Mallu: వీరమల్లు వచ్చేస్తున్నాడు.. పవన్ సినిమా రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన
Hari Hara Veera Mallu Movie
Follow us on

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తొలిసారిగా నటిస్తోన్న హిస్టారికల్ మూవీ ‘హరి హర వీరమల్లు’. జ్యోతికృష్ణ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కథానాయికగా కనిపించనుంది. ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎ. దయాకర్‌ రావు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మొత్తం రెండు భాగాలుగా హరి హర వీరమల్లు తెరకెక్కుతోంది. మొదటి భాగానికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే దాదాపు తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు రిలీజ్‌ డేట్‌ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మే 9వ తేదీన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది చిత్ర బృందం. ఈ మేరకు సినిమా కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. అలాగే ఆడియెన్స్ కు హోలీ పండగ శుభాకాంక్షలు కూడా తెలిపారు. కాగా హరి హర వీరమల్లు కొత్త పోస్టర్ లో పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్ ఇద్దరూ గుర్రపు స్వారీ చేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.

కాగా హరి హర వీరమల్లు సినిమా మార్చి ఆఖరులో రిలీజ్ చేస్తామని ఇది వరకు మేకర్స్ ప్రకటించారు. అయితే షూటింగ్ ఆలస్యం కావడంతో మే 9కు వాయిదా వేసినట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పవన్ కల్యాణ్ పాడిన మాట వినాలి సాంగ్ యూట్యూబ్ లో రికార్డులు కొల్లగొట్టింది. ఇక ఇటీవలే రిలీజైన కొల్లగొట్టినాదిరో..’ పాట లిరికల్‌ వీడియోకు కూడా మంచి స్పందనే వచ్చింది. ఈ సినిమాకు కీర వాణి స్వరాలు సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

గుర్రాలపై పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్..

కాగా పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక రిలీజవుతోన్న మొదటి సినిమా ఇదే. దీంతో హరి హర వీరమల్లుపై అంచనాలు భారీగా ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.