Bro: ఫ్యాన్స్ గెట్ రెడీ.. బ్రో మూవీ టీజర్ వచ్చేస్తోంది.. పూనకాలు తెప్పిస్తోన్న నయా పోస్టర్
ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పవన్ కళ్యాణ్ పోర్షన్ షూటింగ్ మొత్తం పూర్తి చేసిన సముద్ర ఖని షూటింగ్ ను చివరిదశకు తీసుకువచారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా బ్రో. తమిళ్ లో వచ్చిన వినోదయ సిత్తం సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడిగా కనిపించనుంటేన్.. తేజ్ భక్తుడిగా నటించనున్నాడు. ఈ సినిమాకు విలక్షణ నటుడు, రచయిత, దర్శకుడు అయినా సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పవన్ కళ్యాణ్ పోర్షన్ షూటింగ్ మొత్తం పూర్తి చేసిన సముద్ర ఖని షూటింగ్ ను చివరిదశకు తీసుకువచారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పవన్ , సాయి ధరమ్ తేజ్ లుక్స్ విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఈ మూవీని జులై 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే బ్రో మూవీ ప్రమోషన్స్ ను షురూ చేయనున్నారు.
తాజాగా బ్రో మూవీ టీజర్ అప్డేట్ ను త్వరలోనే ఇవ్వనున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుంది. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ తో పాటు తేజ్ కూడా ఉన్నాడు. ఇద్దరు అదిరిపోయే స్టిల్స్ లో కనిపించారు.
పవన్ తమ్ముడు సినిమాలో వయ్యారి భామ సాంగ్ లో కనిపించినట్టు రైల్వే కూలి గెటప్ లో కనిపించగా.. తేజ్ కూడా లుంగీ కట్టి, మేడలో ఎర్ర కండువా వేసుకొని చేతిలో బీడీలు పట్టుకొని కనిపించారు.ఇక ఈ సినిమాకోసం మెగా ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ విడుదలైన తర్వాత ఎలాంటి రికార్డ్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.
Soon… #bro teaser 🙏🏼🙏🏼🙏🏼 pic.twitter.com/C92GT8HAzE
— Sai Dharam Tej (@IamSaiDharamTej) June 27, 2023