Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హిస్టరీలో ఎన్నడూ చూడని గురు శిష్యుల బంధం..

తొలివారం నుంచి పల్లవి ప్రశాంత్‌పై మిగిలిన హౌస్ మేట్స్ అందరూ ముప్పేట దాడి చేస్తుంటే.. శివాజీ మాత్రం అతనికి అండగా నిలబడ్డాడు. అక్కడి నుంచి ఇద్దరి మధ్య బాండింగ్ స్టార్టయ్యింది. శివాజీ ఓ గురువులా సూచలను ఇస్తూ ప్రశాంత్‌ను ముందుకు నడుపుతున్నాడు. మధ్యలో త్యాగాలు చేస్తూ ప్రశాంత్ ఇంటి సభ్యుడు అవ్వడంతో, కెప్టెన్ అవ్వడంలో కీ రోల్ పోషించాడు.

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హిస్టరీలో ఎన్నడూ చూడని గురు శిష్యుల బంధం..
Prasanth - Sivaji
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 12, 2023 | 5:56 PM

బిగ్ బాస్ హిస్టరీలో ఇప్పటివరకు రకరకాల పులిహోర ట్రాకులు చూశాం. హౌస్‌లో కంటిన్యూ అయ్యేందుకు చాలామంది లవ్ ట్రాకులు నడుపుతారు. బయటకు వెళ్లిన తర్వాత ఎవరి పని వారు చేసుకుంటారు. అయితే బిగ్ బాస్ వేదికగా ఫ్రెండ్స్ అయినవారు మాత్రం చాలామంది ఉన్నారు. అయితే ఏ సీజన్‌లో చూడని విధంగా బిగ్ బాస్ సీజన్‌లో 7లో గురు శిష్యుల బంధం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తొలివారం నుంచి పల్లవి ప్రశాంత్‌పై మిగిలిన హౌస్ మేట్స్ అందరూ ముప్పేట దాడి చేస్తుంటే.. శివాజీ మాత్రం అతనికి అండగా నిలబడ్డాడు. అక్కడి నుంచి ఇద్దరి మధ్య బాండింగ్ స్టార్టయ్యింది. శివాజీ ఓ గురువులా సూచలను ఇస్తూ ప్రశాంత్‌ను ముందుకు నడుపుతున్నాడు. ముందుగా ప్రశాంత్ ఇంటి సభ్యుడు అయినా.. ఇప్పుడు కెప్టెన్ అయినా.. దాని వెనుక శివాజీలు స్ట్రాటజీలు, సలహాలు, త్యాగాలు ఉన్నాయి. ఇంత జన్యూన్ బాండింగ్ మాత్రం గతంలో ఎన్నడూ బిగ్ బాస్ వీక్షకులు చూసి ఉండరు.

కాగా బిగ్ బాస్ ఇంట్లో ఇప్పటివరకు ఎమోషనల్ కాని శివాజీ తొలిసారి కన్నీళ్లు పెట్టినంత పని చేశాడు. ప్రశాంత్ కెప్టెన్సీ తీసేయడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. మళ్లీ ఆడు, గెలువు, కెప్టెన్ అయి చూపించు అని ప్రశాంత్‌కు సూచించిన శివాజీ.. లోపల అమర్, భోలా, అశ్విని వాళ్లతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. ఎంతో కష్టపడి ప్రశాంత్ కెప్టెన్సీ సాధించుకున్నాడని.. గుండెలపై తన్నించుకుని మరి ముందుకు వెళ్లాడని పేర్కొన్నాడు. తాను ఎంతో మొండి వాడ్నో.. అంత సెంటిమెంటల్ ఫెల్లోని అని చెప్పుకొచ్చారు శివాజీ. నాకే ఏడుపు వస్తుంది.. వాడికి రాకుండా ఎలా ఉంటుంది అన్నారు శివాజీ.

కాగా ఈ సీజన్‌లో శివాజీ, ప్రశాంత్, యావర్, అర్జున్‌లలో ఒకరు విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మిగతా వాళ్లు అంతగా గేమ్ ఆడటం లేదు. ఆడినా ఓ పద్దతి అంటూ లేదు. ఏదో ఈ వారం నెట్టుకు వస్తే చాలు అన్నట్లు సాగుతుంది వ్యవహారం. బాగా ఆడతాడు అనుకున్న అమర్ తేలిపోయాడు. కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌లో కేవలం అర్జున్ మాత్రమే ఇండిపెండెంట్‌గా కనిపిస్తున్నాడు. మిగతా వాళ్లు ఏదో భజన చేసుకుంటూ.. 2 వారాలు ఉండి పోదాం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. మున్ముందు గేమ్ ఎలా టర్న్ తీసుకుంటుంది, ఆట మారుతుందా..? అనుకోని పరిణామాలు జరుగుతాయా..? లెట్స్ వెయిట్ అండ్ సీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.