‘ఓ బేబీ’ మూవీ రివ్యూ..!

  సినిమా టైటిల్ : ఓ బేబీ నటీనటులు : సమంత, లక్ష్మీ, నాగశౌర్య, రావు రమేష్, జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ తదితరులు దర్శకత్వం : నందిని రెడ్డి సంగీతం : మిక్కీ జే మేయర్ నిర్మాతలు : సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, పీపుల్స్ మీడియా సమంత అక్కినేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని వారి ఇంటి కోడలుగా.. తనదైన ముద్రతో వరుసగా సినిమాలు చేస్తూ.. ప్రేక్షకుల మనసులో సుస్తిర స్థానం […]

'ఓ బేబీ' మూవీ రివ్యూ..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ram Naramaneni

Updated on: Jul 05, 2019 | 2:21 PM

సినిమా టైటిల్ : ఓ బేబీ

నటీనటులు : సమంత, లక్ష్మీ, నాగశౌర్య, రావు రమేష్, జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ తదితరులు

దర్శకత్వం : నందిని రెడ్డి

సంగీతం : మిక్కీ జే మేయర్

నిర్మాతలు : సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, పీపుల్స్ మీడియా

సమంత అక్కినేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని వారి ఇంటి కోడలుగా.. తనదైన ముద్రతో వరుసగా సినిమాలు చేస్తూ.. ప్రేక్షకుల మనసులో సుస్తిర స్థానం సంపాదించుకుంది. బడాహీరోలతో ధీటుగా ఆమె భారీ కటౌట్‌లు థియేటర్ల వద్ద కనిపించడమే ఇందుకు సాక్ష్యం.

తాజాగా.. స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన మూవీ ‘ఓ బేబీ’. కొరియన్‌ మూవీ ‘మిస్‌ గ్రానీ’ని తెలుగులో ‘ఓ బేబీ’గా రీమేక్ చేశారు. ఇందులో నాగ శౌర్య,లక్ష్మీ, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలలో నటించగా.. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. శుక్రవారం విడుదలైన ‘మిస్ గ్రానీ’ ఎంతవరకూ ప్రేక్షకులను అలరించిందో తెలుసుకుందాం..!

కథ :

ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన లక్ష్మి చాలా అమాయకురాలు. ఆమెకు చిన్నవయసులోనే పెళ్లి జరుగుతుంది. నడి వయసు రాగానే భర్తను కోల్పోతుంది. ఆ తరువాత ఎన్నో ఒడిదుడుకులతో పిల్లలను చూసుకుంటుంది. పెద్దవయసులో తన పిల్లలు, మనవళ్లతో కలిసి ఉంటుంది. అయితే.. తన చాదస్తం, ప్రేమతో పిల్లలు కూడా తనలా మారిపోతారనే భయంతో.. కొడుకు ఆమెను వృద్ధాశ్రమంలో చేర్పిస్తాడు. దీంతో.. తనలో తానే మధనపడుతూ ఉంటుంది. వయసు పైబడే కొద్దీ తను.. యుక్తవయసులో ఎలా ఉండాలనుకుందో ఆ కలను నిజం చేసుకోవాలనుకుంటుంది. ఒకరి ద్వారా ఆమెకు ఆ కల సాకారమవుతుంది. పెద్దవయసులో ఉన్న బామ్మ.. నడివయసు సమంతలా ఎలా మారుతుంది..? తన కన్న కలలు ఏంటి..? వాటిని నేరవేర్చుకోగలిగిందా..? అన్నది సినిమాలోనే చూడాలి.

ఎలా ఉందంటే..!

పెద్ద వయసున్న వారు సడన్‌గా యుక్త వయసులోకి వస్తే ఏం చేస్తారు అనే కాన్సెప్ట్ ఆధారంగా డైరెక్టర్ నందినీ రెడ్డి ఈ సినిమా తీసింది. పక్కా ఫుల్ ఎంటర్‌టైనర్‌గా సినిమాను తెరకెక్కించారు. లక్ష్మీ.. సమంతలా మారిన తరువాత ఆమె భాష తీరు, ఆమె ప్రవర్తించే విధానం థియేటర్‌లో నవ్వులు పువ్వులు పూయిస్తున్నాయి. ఆ తరువాత సెంటిమెంట్‌ సీన్లు కూడా బాగా పండాయనే చెప్పొచ్చు. పుట్టినప్పటినుంచీ కాలంతో పరిగెత్తి.. చదువులు, ఫ్యూచర్‌లో పడి వాళ్ల కలలను మర్చిపోతూంటారు. అలాంటి వాళ్లకు తిరిగి వయసు తగ్గిపోతే.. లైఫ్‌ ఎలా ఉంటుంది.. అనేదాన్ని నందిని రెడ్డి చక్కగా మలిచారనే చెప్పాలి. ఎక్కడా బోరు కొట్టకుండా.. కామెడీకి కామెడీ.. అక్కడక్కడ సెంటిమెంట్‌ను నడిపించారు.

ఎలా నటించారంటే..!

లక్ష్మీ, సమంత, నాగశౌర్య, రావు రమేష్, జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, ప్రగతిలు ఎవరి పాత్రకు తగ్గట్టుగా వారు నటించారనే చెప్పాలి. అందరూ తమ పాత్రలకు తగినట్టు వాటికి న్యాయం చేకూర్చారు. ముఖ్యంగా సామ్.. తన భాష, అందం, నటనతో ఆకట్టుకుంది.

మొత్తానికి అందరినీ మెప్పించిన సినిమా ‘ఓ బేబీ’ అని చెప్పవచ్చు.