‘బుర్రకథ’ మూవీ రివ్యూ

నటీనటులు : ఆది సాయికుమార్,  మిస్తీ చక్రబోర్తి , నైరా షా, రాజేంద్రప్రసాద్ త‌దిత‌రులు. దర్శకత్వం :  డైమండ్ రత్నబాబు నిర్మాత : హెచ్‌ కె.శ్రీకాంత్ దీపాల సంగీతం : సాయి కార్తీక్ సినిమాటోగ్రఫర్ : రామ్ ప్రసాద్ రచయిత డైమండ్ రత్నబాబు తొలిసారి మెగాఫోన్ పట్టి  దర్శకత్వం వహించిన చిత్రం “బుర్ర కథ”. ఆది సాయికుమార్ హీరోగా నటించగా..   మిస్తీ చక్రబోర్తి , నైరా షా హీరోయిన్స్ గా ఆడిపాడారు. డబుల్ ధమాక్ అనే ఓ విభిన్న కథాంశంతో  కామెడీ ఎంటర్ […]

‘బుర్రకథ’ మూవీ రివ్యూ
Follow us

|

Updated on: Jul 05, 2019 | 5:40 PM

నటీనటులు : ఆది సాయికుమార్,  మిస్తీ చక్రబోర్తి , నైరా షా, రాజేంద్రప్రసాద్ త‌దిత‌రులు.

దర్శకత్వం :  డైమండ్ రత్నబాబు

నిర్మాత : హెచ్‌ కె.శ్రీకాంత్ దీపాల

సంగీతం : సాయి కార్తీక్

సినిమాటోగ్రఫర్ : రామ్ ప్రసాద్

రచయిత డైమండ్ రత్నబాబు తొలిసారి మెగాఫోన్ పట్టి  దర్శకత్వం వహించిన చిత్రం “బుర్ర కథ”. ఆది సాయికుమార్ హీరోగా నటించగా..   మిస్తీ చక్రబోర్తి , నైరా షా హీరోయిన్స్ గా ఆడిపాడారు. డబుల్ ధమాక్ అనే ఓ విభిన్న కథాంశంతో  కామెడీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా తాజాగా విడుదల అయింది. మరి ఈ మూవీ ఆడియెన్స్‌ను ఎంతమేర అలరించిందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం!

కథలోకి వెళ్తే :

అభిరామ్ (ఆది) రెండు మెద‌ళ్ల‌తో పుడతాడు. అతను పెరిగే క్రమంలో అతని శరీరంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని తెలుస్తుంది. అలా ‘అభిరామ్’ కాస్త అభి.. రామ్‌గా చివరికి ఇద్దరు వ్యక్తులుగా ఎప్పటికప్పుడు మారిపోతుంటాడు. అయితే చిన్నప్పటి నుండీ ఆ ఇద్దరూ ఆలోచనలు వేరు, గోల్స్ వేరు, మైండ్ సెట్స్ వేరు.. దాంతో ఇద్దరికి మధ్య వార్ జరుగుతుంటుంది. ఆ తరువాత వారి జీవితంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఇద్దరూ వేరుగా కాకుండా ఒకేలా ఆలోచిస్తారు. అలా వారిద్దరూ ఆలోచించడానికి ఎవరు కారణం అయ్యారు  ? ఇంతకీ అభి మరియు రామ్ చివరికి వారి గోల్స్‌ను రీచ్ అయ్యారా ? ఈ క్రమంలో వారికి ఎలాంటి సమస్యలు వచ్చాయి? వాటి నుంచి వారు ఎలా బయటపడ్డారు లాంటి విషయాలు తెలియాలంటే సిల్వర్ స్క్రీన్‌పై మూవీ చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

రెండు మెదళ్లు అనే కాన్సెప్ట్ మంచి రక్తి కట్టించేదే. రచయిత కమ్ దర్శకుడు డైమండ్ రత్నబాబు మంచి పాయింట్‌‌నే తన తొలి సినిమాకు ఎన్నకున్నాడు. ఆది కూడా ఆయా పాత్రల్లో ఎప్పటికప్పుడు వైవిధ్యం చూపిస్తూ ఆకట్టుకున్నాడు. ఈ మూవీ అతనిలోని ప్రతిభను చూపించడానికి బాగా ఉపయోగపడింది. ఇక  హీరోయిన్ మిస్తీ చక్రబోర్తి తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ మెప్పించింది. మరో హీరోయిన్ నైరా షాకు ఉన్నది కొన్ని సీన్లే అయినా గ్లామర్ తో ఆకట్టుకుంది. సినిమాలో హీరో తండ్రిగా నటించిన రాజేంద్రప్రసాద్ తన మార్క్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నారు. ఇక కీలక పాత్రల్లో నటించిన పోసాని, చంద్ర, పృథ్వి తమ కామెడీ టైమింగ్ తో  కొన్ని చోట్ల నవ్వించే ప్రయత్నం చేశారు.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నా..స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం మెప్పించలేకపోయాడు.సెకండాఫ్ నిడివి ఎక్కువగా అనిపిస్తుంది. కొన్ని సీన్లు చాలా సాగదీతగా ఉన్నాయి. మొత్తానికి దర్శకుడు తాను అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద కరెక్ట్ గా ఎలివేట్ చేయలేకపోయారు. కంటెంట్ పరంగా మంచి భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలు రాసుకునే అవకాశం ఉన్నా, దర్శకుడు మాత్రం కథకు అవసరం లేని కామెడీ సీక్వెన్స్ తో.. అసందర్భంగా వచ్చే రొమాంటిక్ సాంగ్స్ తో  నడిపించడంతో పూర్తిస్థాయిలో మూవీ ఆడియెన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది.