AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cobra: కోబ్రా ట్రైలర్ నెక్స్ట్ లెవల్ అంతే.. మరీ ఇన్ని షేడ్స్ ఏంటి గురూ..

వర్సటైల్ యాక్టర్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు.  దక్షిణాది చిత్రపరిశ్రమలో ఉన్న అగ్రకథానాయికులలో విక్రమ్ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ఆడియన్స్‏ను మెప్పించారు.

Cobra: కోబ్రా ట్రైలర్ నెక్స్ట్ లెవల్ అంతే.. మరీ ఇన్ని షేడ్స్ ఏంటి గురూ..
Cobra
Rajeev Rayala
|

Updated on: Aug 26, 2022 | 9:12 PM

Share

వర్సటైల్ యాక్టర్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు.  దక్షిణాది చిత్రపరిశ్రమలో ఉన్న అగ్రకథానాయికులలో విక్రమ్ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ఆడియన్స్‏ను మెప్పించారు. హీరోయిజం మాత్రమే కాకుండా కంటెంట్ ప్రాధాన్యతను బట్టి సరికొత్త సాహాసాలు చేసేందుకు ముందుంటాడు విక్రమ్. తెలుగులోనూ ఆయన సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో విక్రమ్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యారు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన సినిమాలన్నీ వరుసగా తెలుగులోకి డబ్ అయ్యాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ హీరో కోబ్రా(Cobra) మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.అజయ్ జ్ఞానముత్తు ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చింది.

కోబ్రా సినిమాను ఎట్టకేలకు ఆగస్టు 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు టీమ్. తాజాగా కోబ్రా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. రీసెంట్ గా వచ్చిన టీజర్ ఆంచనాలను పెంచితే.. తాజాగా వచ్చిన ట్రైలర్ ఆ అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ఈ సినిమాలో విక్రమ్ మ్యాథ్స్ టీచర్ గా కనిపించనున్నారు. విక్రమ్ ‘అపరిచితుడు’ సినిమాలో కంటే కూడా ఎక్కువ షేడ్స్ కలిగిన పాత్రని పోషిస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రంలో అతను పోలీసు ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు అని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. కోబ్రా ఎలాగైతే కుబుసాన్ని వదులుతూ దాక్కుని శత్రువులపై దాడి చేస్తుందో.. ఇందులో విక్రమ్ పాత్ర కూడా అలానే ఉంటుందని తెలిపారు. ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు