AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: అలియా భట్, ఐశ్వర్య కాదు.. ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమె..

కొంతమంది ఒకొక్క సినిమాకు హీరోలకు సమానంగా రూ. 10 కోట్లకు పైగా రెమ్యునరేషన్స్ అందుకుంటున్నారు. మరికొంతమంది మాత్రం గెస్ట్ రోల్స్ కు , స్పెషల్ సాంగ్స్ కు కూడా భారీగానే వసూల్ చేస్తున్నారు.

Actress: అలియా భట్, ఐశ్వర్య కాదు.. ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమె..
Actress
Rajeev Rayala
|

Updated on: Nov 13, 2024 | 5:19 PM

Share

హీరోయిన్స్ సినిమాలతోనే కాదు పలు బ్రాండ్  ప్రమోషన్స్ లోనూ నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సినిమాల్లో హీరోయిన్ గా రాణిస్తున్న ముద్దుగుమ్మలు రెమ్యునరేషన్ కూడా భారీగా తీసుకుంటున్నారు. కొంతమంది ఒకొక్క సినిమాకు హీరోలకు సమానంగా రూ. 10 కోట్లకు పైగా రెమ్యునరేషన్స్ అందుకుంటున్నారు. మరికొంతమంది మాత్రం గెస్ట్ రోల్స్ కు , స్పెషల్ సాంగ్స్ కు కూడా భారీగానే వసూల్ చేస్తున్నారు. అయితే ఇండస్ట్రీలో చాలా మంది రిచెస్ట్ హీరోయిన్స్ ఉన్నారు. కొంతమంది ముద్దుగుమ్మలు భారీగానే ఆస్తిపాస్తులు కూడబెట్టారు. సినిమాలద్వారా యాడ్స్ ద్వారా మాత్రమే కాదు ఇతర బిజినెస్ లాల్లోనూ రాణిస్తున్నారు కొంతమంది భామలు. కాగా ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా.? ఐశ్వర్య రాయ్, అలియా భట్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే..

ఇది కూడా చదవండి : Suriya: సూర్య ఫస్ట్ క్రష్ ఆ హీరోయినా..! జ్యోతిక మాత్రం కాదు

ఇండస్ట్రీలో అదికూడా  ఇండియాలో నెంబర్ వన్ రిచెస్ట్ హీరోయిన్ ఎవరో కాదు.. సీనియర్ ముద్దుగుమ్మ జుహీ చావ్లా . అమితాబ్ బచ్చన్ కంటే ఈ బ్యూటీ ఆస్తులు ఎక్కువ కావడం విశేషం. 90వ దశకంలో గ్లామర్ బ్యూటీగా మెరిసిన ఆమె ఆస్తుల విలువ రూ.4600 కోట్లు. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది జుహీ చావ్లా. జుహీ చావ్లా ‘హురున్ రిచ్ లిస్ట్ 2024’లో చోటు దక్కించుకుంది. షారుఖ్ ఖాన్ ఆస్తులు రూ.7 వేల కోట్లు కాగా, జూహీ ఆస్తులు రూ.4 వేల కోట్లు. ఈ బ్యూటీ షారుఖ్ ఖాన్‌తో కలిసి చాలా వెంచర్లలో పాల్గొంది.

ఇది కూడా చదవండి : S. S. Rajamouli: రాజమౌళికి బాగా నచ్చిన నటి.. సావిత్రి, అనుష్క అనుకుంటే పప్పులో కాలేసినట్టే..

షారుఖ్‌ఖాన్‌కు చెందిన ‘రెడ్‌ చిల్లీస్‌ గ్రూప్‌’కి జూహీ సహ వ్యవస్థాపకురాలు. అలాగే జూహీ ‘కోల్‌కతా నైట్ రైడర్స్’ సహ యజమాని. వీటితో పాటు జూహీ రియల్ ఎస్టేట్ పరిశ్రమలో చాలా పెట్టుబడి పెట్టింది. ఆమె భర్త జే మెహతా కూడా ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అత్యంత సంపన్న నటీమణుల జాబితాలో జూహీ చావ్లా మొదటి స్థానంలో ఉండగా, ఐశ్వర్యరాయ్ (రూ. 850 కోట్లు), ప్రియాంక చోప్రా (రూ. 650 కోట్లు) మూడో స్థానంలో ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us