
జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న కమెడియన్ వేణు. పలు సినిమాల్లోనూ వేణు నటించి మెప్పించాడు, ముఖ్యంగా మున్నా సినిమాలో టిల్లు పాత్రలో నవ్వులు పూయించాడు. వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం ‘బలగం’. ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ అనూహ్య విజయాన్ని నమోదు చేసుకుంది. తెలంగాణ పల్లెల్లోని కుటుంబాల మధ్య జరిగే గొడవలను ఒక చావు చుట్టూ అల్లిన విధానం ప్రేక్షకులను ఫిదా చేసింది. కలెక్షన్లతో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సైతం ఈ సినిమా సొంతం చేసుకుంది. ప్రియదర్శి, కావ్య జంటగా తెరకెక్కిన ఈ సినిమా సరికొత్త ఒరవడిని సృష్టించిందని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు. దీంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టి దర్శకుడు వేణుపై పడింది.
వేణు నుంచి వచ్చే రెండో సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. బలగం లాంటి మూవీ తర్వాత వేణు ఎలాంటి మూవీలో నటించనున్నాడని అందరి దృష్టి పడింది. అయితే వేణు తర్వాతి చిత్రాన్ని ఎల్లమ్మ అనే టైటిల్ ను ఖరారు చేశాడు. ఈ సినిమా కోసం చాలా కాలంగా పని చేస్తున్న వేణు. ముందుగా ఈ సినిమాను నేచురల్ స్టార్ నానితో చేయాలని అనుకున్నారు. కానీ ఎందుకో అది కుదరలేదు. దాంతో మరో యంగ్ హీరో నితిన్ చేతికి ఈ సినిమా వెళ్ళింది. రీసెంట్ డేస్ లో నితిన్ నటించిన సినిమాలన్నీ ప్రేక్షకులను నిరాశపరిచాయి.
చివరిగా వచ్చిన తమ్ముడు అనే సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే ఎల్లమ్మ సినిమాతో నితిన్ పక్కా హిట్ కొడతాడని అతని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కానీ ఇపుడు ఆ ఆశల మీద నీళ్లు చల్లినట్టు అయ్యింది. ఎల్లమ్మ సినిమా నుంచి నితిన్ తప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నితిన్ ప్లేస్ లోకి యంగ్ హీరో శర్వానంద్ రానున్నట్టు టాక్. ఇప్పటికే శర్వానంద్ లో సంప్రదింపులు జరిగినట్టు తెలుస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి