18 pages: ఎవరూ టచ్ చేయని పాయింట్ తో .. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రానున్న నిఖిల్ సినిమా

యంగ్ హీరో నిఖిల్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం తన కెరియర్ లో మంచి విజయాన్ని సొంతచేసుకున్న 'కార్తీకేయ' సినిమా సీక్వెల్ 'కార్తికేయ 2' ను చేస్తున్నాడు.

18 pages: ఎవరూ టచ్ చేయని పాయింట్ తో .. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రానున్న నిఖిల్ సినిమా
Follow us
Rajeev Rayala

| Edited By: Rajitha Chanti

Updated on: Apr 21, 2021 | 7:03 AM

18 pages: యంగ్ హీరో నిఖిల్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం తన కెరియర్ లో మంచి విజయాన్ని సొంతచేసుకున్న ‘కార్తీకేయ’ సినిమా సీక్వెల్ ‘కార్తికేయ 2′ ను చేస్తున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీతో పాటు ’18 పేజెస్’ అనే సినిమా చేస్తున్నాడు. పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై రానున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ఈ సినిమాలోఅనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం సుకుమార్ విలక్షణమైన పాత్రలను సృష్టిస్తున్నాడట.

ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ గెస్టు హౌస్ లో ఈ సినిమా షూటింగు జరుపుకుంటుందని తెలుస్తుంది.  నిఖిల్ – అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్ తో .. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉంటుందని నిఖిల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. దాంతో ఈ సినిమా ఆసక్తి నెలకొంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్న యంగ్ హీరో.. కొత్త సినిమాను లైన్ లో పెట్టిన ఆది సాయికుమార్..