Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Niharika Konidela: ‘ఆ గాయాలకు కాలమే సమాధానం’.. నిహారిక పోస్ట్‌ వైరల్‌.. విడాకులపై హింట్‌ ఇచ్చిందా?

ఇటీవల భార్యభర్తలిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, ఇద్దరూ పెళ్లి ఫోటోలను డిలీట్‌ చేయడంతో విడాకుల రూమర్లకు బలం చేకూరినట్లైంది. అయితేఈ విషయంపై నిహారికతో పాటు మెగా ఫ్యామిలీ పూర్తి సైలెంట్‌గా ఉంది. నిహారిక దాంపత్య బంధంపై ..

Niharika Konidela: 'ఆ గాయాలకు కాలమే సమాధానం'.. నిహారిక పోస్ట్‌ వైరల్‌.. విడాకులపై హింట్‌ ఇచ్చిందా?
Niharika Konidela
Follow us
Basha Shek

|

Updated on: May 03, 2023 | 4:37 PM

మెగా డాటర్‌ నిహారిక కొణిదెల గత కొంత కాలంగా తరచూ వార్తల్లో నిలుస్తోంది. ప్రొఫెషనల్‌ విషయాలతో పాటు పర్సనల్‌ విషయాల పరంగానూ ఆమె పేరు ఎక్కువగా వినిపిస్తోంది. పెళ్లైన తర్వాత నటనకు గుడ్‌బై చెప్పేసిన ఈ అందాల తార నిర్మాతగా మారింది. ఏకంగా సొంతంగా ప్రొడక్షన్‌ హౌస్‌ను ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ఇటీవలే ఆఫీస్‌ను కూడా ఓపెన్‌ చేసింది. సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌లను తెరకెక్కించే పనిలో నిహారిక బిజీగా ఉందని తెలుస్తోంది. ప్రొఫెషనల్‌గా పక్కన పెడితే ఆమె కొన్నాళ్లుగా భర్త చైతన్యకు దూరంగా ఉందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల భార్యభర్తలిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, ఇద్దరూ పెళ్లి ఫోటోలను డిలీట్‌ చేయడంతో విడాకుల రూమర్లకు బలం చేకూరినట్లైంది. అయితేఈ విషయంపై నిహారికతో పాటు మెగా ఫ్యామిలీ పూర్తి సైలెంట్‌గా ఉంది. నిహారిక దాంపత్య బంధంపై ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. ఈ క్రమంలో మెగా డాటర్‌ షేర్‌ చేసిన పోస్ట్‌ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. జిమ్‌లో వర్కవుట్‌ వీడియోను షేర్‌ చేసిన నిహారిక.. దీనికి కొన్ని మోటివేషన్ కోట్స్‌ను యాడ్‌ చేసింది.

‘ ఎనర్జీనంతా కూడబెట్టుకో’, ‘గాయాలకు కాలమే సమాధానం చెప్తుంది’,’ బాగా నిద్రపోండి’, ‘నీళ్లు బాగా తాగండి’, ‘మనం చాలా శక్తిమంతులం’, ‘ఇతరుల పట్ల దయగా, మర్యాదగా  మెలగండి’, మన ఆలోచనల్లో కన్నా మనమెంతో బలవంతులం’ అంటూ ఇన్‌స్పైరింగ్ కోట్స్‌ను రాసుకొచ్చింది నిహారిక. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. భర్త జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు నిహారిక ప్రయత్నిస్తుందని, అందులో భాగంగానే ప్రొఫెషనల్‌ పరంగా మరింతగా బిజీ అయ్యేందుకు చూస్తుందని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. పైళ్లైన తర్వాత ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్‌ను నిర్మించింది నిహారిక. ఇది ఫ్యామిలీ ఆడియెన్స్‌ను బాగా మెప్పించింది. ఇక గతేడాది హలో వరల్డ్‌ అనే వెబ్‌ సిరీస్‌తో మన ముందుకు వచ్చింది. ప్రస్తుతం మరిన్ని వెబ్‌ సిరీస్‌ల కోసం కథలు వింటున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..