Gentleman: సీక్వెల్‌కు సిద్దమవుతున్న ‘జెంటిల్ మన్’.. హీరోయిన్ ఎవరో తెలుసా..
ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో సీక్వెల్ హడావిడి నడుస్తుంది. రీసెంట్ గా వచ్చిన సినిమాలే కాదు 20 ఏళ్ల క్రితం వచ్చిన సినిమాలకు కూడా సీక్వెల్స్ వస్తున్నాయి ఇప్పుడు.
Gentleman: ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో సీక్వెల్ హడావిడి నడుస్తుంది. రీసెంట్ గా వచ్చిన సినిమాలే కాదు 20 ఏళ్ల క్రితం వచ్చిన సినిమాలకు కూడా సీక్వెల్స్ వస్తున్నాయి ఇప్పుడు. అందుకు ఉదాహరణ భారతీయుడు 2 కమల్ హాసన్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు(Bharateeyudu)సినిమాకు ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు అదే బాటలో మరో సినిమా కూడా సీక్వెల్ కు సిద్ధం అయ్యింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన జెంటిల్ మన్ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ సర్జా, మధు బాల నటించిన అప్పట్లోనే రికార్డులు క్రియేట్ చేసింది. 1993లో విడుదలైన ఈ సినిమాలో అర్జున్ , మధుభాలతోపాటు శుభశ్రీ ప్రధాన పాత్రల్లో నటించి అలరించారు. ఇప్పటికీ ఈ సినిమా మూవీ లవర్స్ ఫ్యావరెట్ మూవీనే.. జెంటిల్ మన్ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ కె.టి.కుంజుమన్ తెరకెక్కించారు. జెంటిల్‌మెన్ చిత్రం తర్వాత పలు భారీ చిత్రాలను నిర్మించిన నిర్మాత కె.టి. కుంజుమోన్ చాలా కాలం గ్యాప్ తర్వాత జెంటిల్‌మెన్ 2 సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు.
కె.టి.కుంజుమన్ భారీ ప్రాజెక్ట్ జెంటిల్ మన్ 2 తో తిరిగి నిర్మాణరంగం లోకి వచ్చారు. మలయాళం లో పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్ అయిన నయనతార చక్రవర్తి జెంటిల్ మన్ 2తో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఎన్టీఆర్ బయోపిక్ లో అతిధి పాత్ర పోషించిన తర్వాత నయనతార చక్రవర్తి చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో మరో కథానాయిక కూడా నటించనున్నారు అనేది త్వరలో వెల్లడికానుంది. మెగా ప్రొడ్యూసర్ కె.టి.కుంజుమన్ తన ట్విట్టర్ లో ఈ విషయాన్ని తెలియజేస్తూ.. హీరోయిన్ గా నయనతార చక్రవర్తిని పరిచయం చేస్తున్నాము. మరో కథానాయికను త్వరలో వెల్లడిస్తాం’ అని పేర్కొన్నారు. ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి జెంటిల్ మన్ 2 కి సంగీతం అందించనున్నారు. ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు.