Nayantara: నయనతార షాకింగ్ డెసిషన్ ?.. షాక్‎లో అభిమానులు.. ఏం జరిగిందంటే..

డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది నయన్. వీరికి కవలలు జన్మించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

Nayantara: నయనతార షాకింగ్ డెసిషన్ ?.. షాక్‎లో అభిమానులు.. ఏం జరిగిందంటే..
Nayanthara
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 26, 2023 | 10:14 AM

దక్షిణాది చిత్రపరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ నయనతార. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకోవడమే కాకుండా.. హీరోలతో సరి సమానంగా రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి చేరింది. తెలుగుతోపాటు.. తమిళంలోనూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన నయన్.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లకు విభిన్నం. దాదాపు పదేళ్లుగా నయన్ సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఆమె భర్త తెరకెక్కించిన కనెక్ట్ సినిమా ప్రచార కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొన్నారు. అంతేకాదు.. అటు మీడియాకు.. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ ప్రైవసీ మెయింటెన్ చేస్తుంటారు. అయినా.. ఇప్పటివరకు ఆమెను బీట్ చేయలేకపోయారు మిగతా హీరోయిన్స్. ఇటీవల ప్రియుడు డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది నయన్. వీరికి కవలలు జన్మించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

వరుస చిత్రాలతో ఎప్పుడూ బిజీగా ఉండే నయన్ కొంతకాలం పాటు నటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న సినిమాలను పూర్తిచేసిన తర్వాత కొంతకాలం పాటు సినిమాలను పక్కన పెడుతుందని సమాచారం. ఇందుకు కారణం ఆమె పిల్లలు. చిన్నారుల ఆలనా పాలన స్వయంగా చూసుకోవడం కోసమే ఆమె ఈ నిర్ణయాన్ని తీసుకుందని అంటున్నారు.

ఇవే కాకుండా.. ఆమె తన సొంత నిర్మాణ సంస్థపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం నయనతార బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతున్న జవాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి కీలకపాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ 2న విడుదల కాబోతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.