
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ అనగనగా ఒక రాజు. జాతిరత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నవీన్.. ఆ తర్వాత జాగ్రత్తగా కథలు ఎంచుకుంటున్నాడు. కొన్ని రోజుల క్రితం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో అలరించిన ఈ హీరో.. ఇప్పుడు సంక్రాంతి పండక్కి థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. అనగనగా ఒక రాజు సినిమాలో నవీన్ జోడిగా సక్సెస్ బ్యూటీ మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‌కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..
మారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి క్యూరియాసిటి నెలకొంది. ఇదివరకు విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు విడుదలైన ట్రైలర్ సంక్రాంతి పండగ వాతావరణాన్ని తీసుకోచ్చింది. ఎప్పటిలాగే తన కామెడీ టైమింగ్ తో నవీన్ అలరించనున్నట్లు తెలుస్తోంది. అలాగే మరోసారి అందంతో కట్టిపడేస్తుంది మీనాక్షి.
ఇవి కూడా చదవండి : Actress Sudha : టాప్ హీరో.. చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. నటి సుధ ఎమోషనల్..
ఈ సినిమాను సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 14న రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సినిమాతోపాటు రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి వంటి చిత్రాలు పండక్కి విడుదల కానున్నాయి.
ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..
ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..