AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naveen Chandra : ఆకట్టుకుంటున్న “బ్రో” మూవీ.. నవీన్ చంద్ర ఖాతాలో హిట్ పడ్డట్టేనా..

నవీన్ చంద్ర గ‌త కొంత కాలంగా మంచి చిత్రాలు ఎంచుకుని న‌టిస్తూ త‌న‌కంటూ ఒక మంచి ఇమేజ్ ని ఫ్యామిలి ఆడియ‌న్స్ లో సంపాదిస్తున్నాడు.

Naveen Chandra : ఆకట్టుకుంటున్న బ్రో మూవీ.. నవీన్ చంద్ర ఖాతాలో హిట్ పడ్డట్టేనా..
Bro
Rajeev Rayala
|

Updated on: Nov 27, 2021 | 8:23 AM

Share

నవీన్ చంద్ర గ‌త కొంత కాలంగా మంచి చిత్రాలు ఎంచుకుని న‌టిస్తూ త‌న‌కంటూ ఒక మంచి ఇమేజ్ ని ఫ్యామిలి ఆడియ‌న్స్ లో సంపాదిస్తున్నాడు. ఈనెల 26న సోని లివ్ ఓటీటీ లో విడుదలైన “బ్రో” మూవీలో త‌న న‌ట‌న‌తో అంద‌రిని  ఆక‌ట్ట‌కున్నాడు.  చెల్లెల్ని ప్రాణంగా ప్రేమించే అన్న పాత్ర‌లో జీవించాడ‌నే చెప్పాలి. త‌న చెల్లెలు ఆరోగ్యం కొసం కావ‌ల్సిన మ‌నీ కొసం దుబాయ్ వెళ్ళి అక్క‌డే వుంటూ త‌న కుటుంబాన్ని ముఖ్యంగా త‌న చెల్లెల్ని అమితం గా ప్రేమించే అన్న పాత్ర ప్ర‌తి ఒక్క ప్రేక్ష‌కుడికి గుర్తిండిపోతుంది. అలాగే చెల్లెలుగా న‌టించిన‌ అవికా గోర్ కెరీర్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ అని చెప్ప‌చ్చు. ఈ పాత్రలో అన్న‌య్యే త‌న‌కి అన్ని అని బ్ర‌తికే చెల్లెలు పాత్ర లో అంద‌ర్ని అల‌రించింది. త‌న జీవితంలో పెద్ద పెనుతుఫాను వ‌చ్చినా త‌న అన్న‌కి ఏమి కావాలో అన్ని స‌మ‌కూర్చే చక్క‌టి పాత్ర‌లో అవికాగోర్ అంద‌ర్ని క‌వ్వించి క‌న్నీళ్ళు తెప్పిస్తుంది. అన్నా చెల్లెళ్ళ మ‌ద్య ఒక ఢిఫ‌రెంట్ క‌థ‌నాన్ని ద‌ర్శ‌కుడు తీస‌కున్నాడు. అలాగే అవికా గోర్ ల‌వ్ స్టోరి అంద‌ర్ని ఆక‌ట్టుకుంటుంది. ఈచిత్రాన్ని కార్తిక్ తుపురాని తెర‌కెక్కించిన ఈ చిత్రం సినిమా ప్రేక్ష‌కుల్ని ముఖ్యంగా ఫ్యామిలి ఆడియ‌న్స్‌ని ఆక‌ట్ట‌కుంటుంది.

స‌క్సెస్ ఫుల్ టాక్ తో సోనీ లివ్ ఓటిటిలో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రాన్ని జేజేఆర్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రవిచంద్ నిర్మించారు. భాస్కరభట్ల‌రాసిన ప్ర‌తి పాట హ్రుద‌యాన్ని ఆక‌ట్టుకుంటుంది. శేఖర్ చంద్ర సంగీతం అర్ద‌వంతంగా సిట్యూవేష‌న్‌ని బ‌ల‌ప‌రిచేలా వుంది. అజీమ్ మహమ్మద్ సినిమాటోగ్రఫీ క‌ళ్ళకి ఆహ్లాదాన్నిస్తుంది. “బ్రో” సినిమాకు విప్లవ్ నైషధం ఎడిటింగ్ చాలా ప్ల‌స్ అయ్యింది. సచిన్ కుందాల్కర్ క‌థ చాలా కొత్త‌గా ఎమెష‌న‌ల్ గా వుంది. ఏక్ మిని క‌థ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ తో నిర్మాణ‌ రంగంలొకి అడుగు పెట్టిన మ్యాంగో మాస్ మీడియా త‌న రెండ‌వ చిత్రం‌గా “బ్రో”తో రెండ‌వ స‌క్స‌స్ సాధించి స‌క్స‌స్‌ఫుల్ నిర్మాణ సంస్థ గా పేరు సాందించారు. సంస్థ అధినేత రామ్, మ్యాంగ్ మాస్ మీడియా సంస్థ ద్వారా నూత‌న ద‌ర్శ‌కుల్ని ప్రొత్స‌హిస్తున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న ద్వారా ప్రేక్ష‌కుల ముందుకి వ‌చ్చి, సూప‌ర్ హిట్ టాక్ అందుకున్న‌ బ‌ట్ట‌ల రామ స్వామి, ఫ్యామిలీ డ్రామా వంటి చిత్రాలు నూత‌న ద‌ర్శ‌కుల తెర‌కెక్కించిన సినిమాలే కావ‌డం విశేషం. ఇదే పంధాలో రామ్ “బ్రో” వంటి వైవిధ్య‌మైన చిత్రాన్ని విడుద‌ల చేసి, మ‌రో స‌క్సెస్ అందుకున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sree Leela : నవ్వే నిండు చందమామ.. ఈ పుత్తడిబొమ్మ.. అందాల శ్రీలీల లేటెస్ట్ ఫొటోస్..

Ramya Krishna: తమిళ బిగ్‌బాస్‌ హోస్ట్‌గా శివగామి!.. కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్న ఆసక్తికర వార్త..

Akhanda : రికార్డుల మోత మోగాల్సిందే.. డిసెంబర్‌ 2 కోసం ఎదురుచూస్తున్న నందమూరి ఫ్యాన్స్..