AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saripodhu Sanivaram: మరోసారి అదే సెంటిమెంట్‌తో రానున్న నేచురల్ స్టార్ నాని..

మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ అన్ని భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. రేడియో జాకీగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి ఆతర్వాత హీరోగా మారాడు. నాని సినిమా సెలక్షన్ చాలా విభిన్నంగా ఉంటాయి. నాని కంటెంట్‌కే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాడు. వరుసగా సినిమాలు చేసి ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగిస్తున్నాడు.

Saripodhu Sanivaram: మరోసారి అదే సెంటిమెంట్‌తో రానున్న నేచురల్ స్టార్ నాని..
Nani
Rajeev Rayala
|

Updated on: Oct 26, 2023 | 7:08 AM

Share

నేచురల్ స్టార్ నాని టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే దసర అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ అన్ని భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. రేడియో జాకీగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి ఆతర్వాత హీరోగా మారాడు. నాని సినిమా సెలక్షన్ చాలా విభిన్నంగా ఉంటాయి. నాని కంటెంట్‌కే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాడు. వరుసగా సినిమాలు చేసి ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగిస్తున్నాడు. నాని నటించిన ‘దసరా’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత ఇప్పుడు హాయ్ నాన్న అనే సినిమా చేస్తున్నాడు. ఇది నాని 31 వ సినిమా

త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మరో సినిమాను కూడా అనౌన్స్ చేశాడు. సరిపోదా శనివారం అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. గతంలో నాని హీరోగా ‘అంటే సుందరానికి’ అనే ఫ్యామిలీ లవ్ మూవీని డైరెక్ట్ చేసిన వివేక్ ఆత్రేయ మరోసారి నానితో చేతులు కలిపాడు. దసరా పండుగ సందర్భంగా ‘సరిపోదా శనివారం’ అనే  సినిమా చేస్తున్నాడు. నిర్మాత డివివి దానయ్య స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందజేసి సినిమాను ప్రారంభించారు. ప్రముఖ తెలుగు నిర్మాత దిల్ రాజు కెమెరాను ప్రారంభించగా, ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ క్లాప్ కొట్టి శుభాకాంక్షలు తెలిపారు. ముహూర్తపు వేడుకకు ఎస్‌జే సూర్యతో పాటు చిత్రబృందం అంతా హాజరయ్యారు.

‘సరిపోదా శనివారం’ ప్యూర్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం కావడంతో ఈ సినిమా కథ , పాత్ర కోసం నాని చాలా ట్రైనింగ్ తీసుకున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్. తమిళ స్టార్ నటుడు ఎస్‌జే సూర్య కీలక పాత్రలో నటించనున్నారు. జేక్స్ బిజోయ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో చేయనున్నారు. ట్రిపుల్ ఆర్ సహా సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన డీడీవీ ఎంటర్ టైనర్ బ్యానర్ పై దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాని నటించిన ‘హాయ్ నాన్న’ డిసెంబర్‌లో విడుదల కానుంది. 2024లో ‘సరిపోదా శనివారం’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై నాని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు, ‘దసరా’ సినిమా తరహాలోనే ఈ సినిమాలో నాని మాస్ అవతార్‌లో కనిపించనున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే