Nani: థర్టీన్‌ ఇయర్స్‌ ఇండస్ట్రీ ఇక్కడ… నాని జీవితాన్ని మలుపు తిప్పింది ఈ రోజే.

Nani: నేచురల్‌ స్టార్‌ నాని.. ఇప్పుడీ హీరో పేరు తెలియని సగటు సినీ ప్రేక్షకుడు ఉండడనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండేదేమో. నాని నుంచి సినిమా వస్తుందంటే చాలు మినిమం ఎంటర్‌టైన్‌మెంట్‌...

Nani: థర్టీన్‌ ఇయర్స్‌ ఇండస్ట్రీ ఇక్కడ... నాని జీవితాన్ని మలుపు తిప్పింది ఈ రోజే.
Nani Movies
Follow us

|

Updated on: Sep 05, 2021 | 1:00 PM

Nani: నేచురల్‌ స్టార్‌ నాని.. ఇప్పుడీ హీరో పేరు తెలియని సగటు సినీ ప్రేక్షకుడు ఉండడనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండేదేమో. నాని నుంచి సినిమా వస్తుందంటే చాలు మినిమం ఎంటర్‌టైన్‌మెంట్‌ గ్యారంటీగా ఉంటుందని భావించే వారు చాలా మంది ఉన్నారు. సినిమాలో పెద్దగా బలం లేకపోయినా ఒంటి చేత్తో చిత్రాన్ని గట్టెక్కించే సత్తా నాని సొంతం. కేవలం నాని చరిష్మాతోనే విజయవంతమైన సినిమాలు కూడా ఉన్నాయనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు. ఓవైపు యాక్షన్‌ చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు ప్రేమ కథా చిత్రాలతో అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకుంటారు నాని.

అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ మొదలు పెట్టిన నాని.. నేడు టాలీవుడ్‌ అగ్ర హీరోలలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. ఇదిలా ఉంటే ఈరోజు (సెప్టెంబర్‌ 05) నాని జీవితాన్ని మలుపు తిప్పిన రోజు. నాని హీరోగా తెరకెక్కిన ‘అష్టా చమ్మా’ విడుదలై నేటికి సరిగ్గా 13 ఏళ్లు పూర్తవుతోంది. 2008, సెప్టెంబర్‌ 05న విడుదలైన ఈ సినిమా నాని కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. తొలి సినిమాతోనే తన సహజ నటనతో ఇండస్ట్రీకి మరో ట్యాలెంటెడ్‌ నటుడు దొరికారు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అత్యధిక వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది.

ఈ క్రమంలోనే తాను హీరోగా మారి 13 ఏళ్లు పూర్తవుతోన్న నేపథ్యంలో నాని ట్విట్టర్‌ వేదికగా ఆసక్తికరమైన పోస్ట్‌ చేశారు. రైళ్లలో ప్రయాణిస్తోన్న సమయంలో దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేస్తూ.. ’13 ఏళ్ల ప్రయాణం’ అనే క్యాప్షన్‌ జోడించారు. ఇక నాని హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం టక్‌ జగదీశ్‌ ఈ నెల 10న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలవుతోన్న విషయం తెలిసిందే.

Also Read: Tuck Jagadish: టక్‌ జగదీష్ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడానికి కారణం అదే… నిర్మాత ఏం చెప్పారంటే..

Trisha: హీరోయిన్ త్రిషను వెంటనే అరెస్ట్ చేయాలి.. భగ్గుమన్న హిందూ సంఘాలు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Poonam Kaur: ‘అతను ఒక రాజకీయ నేరగాడు’… సంచలన ట్వీట్ చేసిన పూనమ్‌ కౌర్‌. ఇంతకా వ్యక్తి ఎవరు.?