National Film Awards 2023: నేషనల్ అవార్డ్ రేసులో అల్లు అర్జున్.. చరిత్ర సృష్టించనున్నాడా ?..
డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇందులో ఎర్రచందనం స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటనకు సౌత్ కాదు.. నార్త్ సినీప్రియులు కూడా అభిమానులయ్యారు. ఇందులో బన్నీ మ్యానరిజం, డైలాగ్ డెలివరీపై సినీ విమర్శకులు ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా భారీగా వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమాలో బన్నీ చెప్పిన తగ్గేదే లే అన్న మాట.. యావత్ ప్రపంచంలోనే వైరలయ్యింది. ఈ డైలాగ్ అటు సెలబ్రెటీస్, ఇటు క్రికెటర్స్ కూడా ఎక్కువగా ఉపయోగించారు.

69వ జాతీయ సినిమా అవార్డ్స్ వేడుకలు న్యూఢిల్లీలో గురువారం సాయంత్రం ప్రకటించనున్నారు. భారతదేశంలోని అత్యంత ప్రముఖ చలనచిత్ర అవార్డ్ వేడుకలలో ఒకటిగా అందించే నేషనల్ అవార్డ్స్ కోసం సినీ ప్రియులు, సినీతారలలో ఆసక్తి నెలకొంది. అయితే ఈసారి అవార్డ్స్ విజేతలలో గట్టిపోటీ ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ఈ రెండేళ్లలో ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా దక్షిణాది నుంచి అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈసారి ఉమెన్ ఓరియెంటెడ్ చిత్రాలకు మంచి ఆదరణ లభించింది. ఇక సౌత్ నుంచి రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్, డైరెక్టర్ సుకుమార్, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప, అలాగే నాయట్టు, ఆర్.మాధవన్ దర్శకత్వం వహించిన రాకెట్రీ. ది నంబి ఎఫెక్ట్, బాసిల్ జోసెఫ్ దర్శకత్వం వహించిన మిన్నల్ మురళి చిత్రాలు పోటీ పడనున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇందులో ఎర్రచందనం స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటనకు సౌత్ కాదు.. నార్త్ సినీప్రియులు కూడా అభిమానులయ్యారు. ఇందులో బన్నీ మ్యానరిజం, డైలాగ్ డెలివరీపై సినీ విమర్శకులు ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా భారీగా వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమాలో బన్నీ చెప్పిన తగ్గేదే లే అన్న మాట.. యావత్ ప్రపంచంలోనే వైరలయ్యింది. ఈ డైలాగ్ అటు సెలబ్రెటీస్, ఇటు క్రికెటర్స్ కూడా ఎక్కువగా ఉపయోగించారు. ఇక ఈ సినిమాలోని సాంగ్స్ సైతం నెట్టింట వైరలయ్యాయి. తన కెరీర్ లోనే బన్నీ నటన ది బెస్ట్ అని చెప్పొచ్చు. అందుకే ఈసారి జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఎంపికయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా మంది బన్నీ వైపే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ అంతా అనుకున్నట్లే అల్లు అర్జున్ కు జాతీయ అవార్డ్ వస్తే చరిత్ర సృష్టించినట్లే. ఎందుకంటే ఇప్పటివరకు ఒక్క తెలుగు నటుడికి నేషనల్ అవార్డ్ రాలేదు. తెలుగు సినిమాల్లో నటించిన ఇతర బాషా నటులు కమల్ హాసన్ లాంటివాళ్లకు వచ్చింది కానీ తెలుగు వాళ్లకు మాత్రం రాలేదు. ఒకవేళ అల్లు అర్జున్ కు వస్తే మాత్రం నిజాంగానే చరిత్ర సృష్టించినట్టే.




View this post on Instagram
అలాగే ఉత్తమ నటి అవార్డ్ రేసులో బాలీవుడ్ నటి అలియా భట్, కంగనా రనౌత్ మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ఎందుకంటే అలియా నటించిన గంగూబాయి కతియావాడి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అలాగే కంగనా నటించిన తలైవి చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రెండు చిత్రాలకు గానూ అలియా, కంగనా బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్ కోసం పోటీ పడనున్నారు.
View this post on Instagram
ఇక దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి తన సంగీతానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డ్ గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
