Dasara : దుమ్మురేపుతోన్న దసరా.. ఆ రికార్డు దిశగా దూసుకుపోతోన్న నాని సినిమా

రా అండ్ రస్టిక్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. నాని ఊర మాస్ పాత్రలో నటించి మెప్పించాడు. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి వసూళ్లను కూడా రాబడుతోంది.

Dasara : దుమ్మురేపుతోన్న దసరా.. ఆ రికార్డు దిశగా దూసుకుపోతోన్న నాని సినిమా
Dasara
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 05, 2023 | 3:29 PM

నేచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన దసరా సినిమా మార్చి 30న విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. రా అండ్ రస్టిక్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. నాని ఊర మాస్ పాత్రలో నటించి మెప్పించాడు. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి వసూళ్లను కూడా రాబడుతోంది. ఇప్పటికే ఈ సినిమా వంద కోట్ల మార్క్ ను కూడా రీచ్ అయ్యింది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన దసరా అని భాషల్లో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. టైర్ 2 హీరోలలో వేగంగా 100 కోట్ల కలెక్షన్స్ రికార్డు అందుకున్న సినిమా గా దసరా నిలిచింది.

ఇక ఈ సినిమా ఓవర్సీస్ లోనూ దుమ్ము రేపుతోంది. ఇప్పటికే దసరా యూఎస్ లో వన్ మిలియన్ క్లబ్ లో చేరిపోయింది. ఇక ఇప్పుడు 2 మిలియన్ కలెక్షన్స్ దిశగా పరుగులుపెడుతోంది. ఇప్పటికే అక్కడ 2 ములియన్ క్లబ్ లో చేరిన సినిమాల్లో ప్రభాస్ బాహుబలి, రాధేశ్యామ్ సినిమాలు ఉన్నాయి.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నాలుగు సినిమాలు ఏకంగా యూఎస్ లో 2 మిలియన్ క్లబ్ లో ఉన్నాయి. అలాగే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ అరవింద సమేత నాన్నకు ప్రేమతో, మెగాస్టార్ చిరంజీవి ఖైదీ 150 సైరా నరసింహారెడ్డి వాల్తేర్ వీరయ్య, రాంచరణ్ రంగస్థలం, ఆర్ఆర్ఆర్, అల్లు అర్జున్ పుష్ప అల వైకుంఠపురంలో,   పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, అజ్ఞాతవాసి. వరుణ్ తేజ్ ఎఫ్2 , ఫిదా. విజయ్ దేవరకొండ గీతగోవిందం, నితిన్ అఆ, వెంకటేష్ ఎఫ్2 సినిమాలు అక్కడ 2 మిలియన్ క్లబ్ లో చేరాయి. ఇక ఇప్పుడు నేచురల్ స్టార్ నాని కూడా  దసరా సినిమాతో ఆ రిక్కార్డును అందుకోనున్నాడు