Brahmanandam: చమ్కీల అంగీ సాంగ్ బ్రహ్మానందం స్టైల్‌లో.. చూస్తే నవ్వాపుకోలేరు
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. సింగరేణి బొగ్గుగనుల్లో ఈ సినిమాను షూట్ చేశారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
నేచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నాని మునుపెన్నడూ కనిపించని ఊర మాస్ పాత్రలో కనిపించనున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. సింగరేణి బొగ్గుగనుల్లో ఈ సినిమాను షూట్ చేశారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే రీసెంట్ గా వచ్చిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో నాని నటన నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది.
ఇదిలా ఉంటే ఇటీవల ఈ సినిమాలో ఓ సాంగ్ రిలీజ్ అయ్యింది. “చమ్కీల అంగీ యేసి .. ఓ వదినే” అంటూ సాగే సాంగ్ ను రిలీజ్ చేశారు. కాసర్ల శామ్ సాహిత్యం అందించిన ఈ పాటను.. రామ్ మిరియాల, దీ కలిసి ఆలపించారు. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
అయితే ఈ పాటను మార్చేశారు మీమర్స్.. ఈ పాటను బ్రహ్మానందం వర్షన్ లో క్రియేట్ చేశారు. మీమర్స్ కు గాడ్ లాంటివారు బ్రహ్మానందం. ఏ పాట వచ్చిన దాన్ని బ్రహ్మానందం వర్షన్ లో చేస్తుంటారు. తాజాగా చమ్కీల సాంగ్ ను కూడా బ్రహ్మీ వర్షన్ చేశారు. ఇప్పుడు ఇది తెగ వైరల్ అవుతోంది. పాటకు మ్యాచ్ అయ్యేలా సీన్స్ ను కట్ సాంగ్ క్రియేట్ చేశారు. ఈ పాట చూస్తే నవ్వకుండా ఉండలేరు..