Ram Charan: బాబోయ్.. ఆస్కార్ వేడుకలో చరణ్ ధరించిన డ్రస్ ధర తెలుసా.? దెబ్బకు నోరెళ్లబెట్టాల్సిందే

యూత్‌ తనను ఫాలో అయ్యేలా చేసుకుంటూ ఉంటారు. ఆరెంజ్ సినిమా నుంచి ఇదే చేస్తున్నారు. ఇక ఇప్పుడేమో అందర్నీ నోరెళ్ల బెట్టేలా చేసుకుంటున్నారు.

Ram Charan: బాబోయ్.. ఆస్కార్ వేడుకలో చరణ్ ధరించిన డ్రస్ ధర తెలుసా.? దెబ్బకు నోరెళ్లబెట్టాల్సిందే
Ram Charan
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Mar 16, 2023 | 5:00 PM

టాలీవుడ్‌ హీరోలందరిలో.. కాస్త ఫ్యాషన్ సెన్స్ ఎక్కువగా ఉన్నట్టు కనిపించే రామ్‌చరణ్.. ఆ సెన్స్‌ కారణంగానే.. ఫ్యాషన్‌ పేజెస్‌లో ట్రెండ్ అవుతుంటారు. ఆన్‌ స్క్రీన్‌.. ఆఫ్‌స్క్రీన్‌ తన ఛాయిస్ ఆఫ్ క్లోత్స్‌తో.. అందర్నీ ఇంప్రెస్ చేస్తుంటారు. యూత్‌ తనను ఫాలో అయ్యేలా చేసుకుంటూ ఉంటారు. ఆరెంజ్ సినిమా నుంచి ఇదే చేస్తున్నారు. ఇక ఇప్పుడేమో అందర్నీ నోరెళ్ల బెట్టేలా చేసుకుంటున్నారు. చెర్రీ ఆస్కార్ అవుట్ ఫిట్ కాస్ట్ బయటికి రావడంతో.. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నారు.

ఇండియాలోనే టాప్‌ డిజైనర్స్‌ అయిన.. నిఖితా సింఘానియా.. శాంతను డిజైన్ చేసిన ఈ సూట్ కాస్ట్.. దాదాపు ఓ లక్ష డాలర్స్ ఉండొచ్చని నెట్టింట రూమర్స్ వినిపిస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే అందుకు కారణం.. ఇంపోర్టెడ్ హ్యాడ్‌ మేడ్ క్లాత్ అయ్యి ఉండొచ్చునని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇది ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ.. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది.

మెగా పవర్ స్టార్ మాములుగా ఉండదు మరి అంటున్నారు ఫ్యాన్స్. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న చరణ్ ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు చెర్రీ.