Nani: ‘దసరా’తో నేచురల్ స్టార్ సక్సెస్ దారిలోకి వచ్చేనా..? మొదటిసారి తెలంగాణ యాసలో మాట్లాడనున్న నాని..
నేచురల్ స్టార్ నాని చేసే ప్రతీ సినిమా, ఎంచుకునే ప్రతీ పాత్ర కొత్తగానే ఉంటుంది. అయితే ఇప్పుడు నాని ఎంచుకున్న కారెక్టర్ మాత్రం ఇది వరకు ఎన్నడూ చూడనిది.

Nani: నేచురల్ స్టార్ నాని చేసే ప్రతీ సినిమా, ఎంచుకునే ప్రతీ పాత్ర కొత్తగానే ఉంటుంది. అయితే ఇప్పుడు నాని ఎంచుకున్న కారెక్టర్ మాత్రం ఇది వరకు ఎన్నడూ చూడనిది. దసరా సందర్భంగా తన కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్‌తో నాని అందరినీ ఆశ్చర్యపరిచారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రాబోతోన్న నాని కొత్త సినిమాకు దసరా అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వీసీ) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాతీయ ఉత్తమ నటిగా అవార్డు పొందిన మహానటి కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు.
దసరా సందర్భంగా పోస్టర్‌తో పాటు ఓ గ్లింప్స్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో సినిమాలోని నేపథ్యం, కాన్సెప్ట్‌ను ఎలా ఉంటుందో ఓ చిన్న హింట్ ఇచ్చారు. ఇందులో నాని, కీర్తి సురేష్ లుక్ ఎలా ఉంటుందో చూపించారు. ఒకప్పటి కాలంలోని రైళ్లు, ఆ ట్రాక్, బతుకమ్మ పాట ఇలా అన్నింటిని చూస్తుంటే ఇది పక్కా తెలంగాణ భాష, యాసలో తెరకెక్కిస్తోన్నట్టు కనిపిస్తోంది. ఇక చివర్లో నాని తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ఈ చిత్రం గోదావరి ఖనిలోని బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో నాని ఇది వరకు ఎన్నడూ చూడని కొత్త అవతారంలో కనిపించబోతోన్నారు. ఇదిలా ఉంటే మొదటిసారి నాని ఈ సినిమలో తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు. గతంలో నాని నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమాలో చిత్తూరు యాసలో మాట్లాడి ఆకట్టుకున్నారు నాని. ఇటీవలే విడుదలైన లవ్ స్టోరీ సినిమాలో యంగ్ హీరో నాగచైతన్య తెలంగాణ యాసలో మాట్లాడి ప్రేక్షకుల చేత శబాష్ అనిపించుకున్నారు. అంతకు ముందు ఎనర్జిటిక్ హీరో రామ్ ఇష్మార్ట్ శంకర్ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడి అదరగొట్టారు. ఇక ఇప్పుడు నాని తెలంగాణ యాసలో ఎలా అదరగొడతారో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :