AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalyan Ram: ‘ఆయన స్థాయిని నేను చేరుకోలేను.. నన్ను వారితో పోల్చకండి’.. కళ్యాణ్ రామ్ ఆసక్తికర కామెంట్స్..

ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. అలాగే పి. సుశీల, నిర్మాత మైత్రి రవిశంకర్, వ్యాపారవేదత్త మువ్వా పద్మయ్య తదితరులు ప్రసగించారు.

Kalyan Ram: 'ఆయన స్థాయిని నేను చేరుకోలేను.. నన్ను వారితో పోల్చకండి'.. కళ్యాణ్ రామ్ ఆసక్తికర కామెంట్స్..
Kalyan Ram
Rajitha Chanti
|

Updated on: Mar 23, 2023 | 1:08 PM

Share

ఇటీవలే బింబిసార, అమిగోస్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. ప్రస్తుతం ఆయన డెవిల్ సినిమా చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం జరిగిన శ్రీకళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో 25వ ఉగాది పురస్కారాల ప్రదానోత్సవ వేడుకలలో ఆయన పాల్గొ్నారు. చెన్నై రాయపేటలోని మ్యూజిక్ అకాడమీ ఆవరణలో నిర్వహించిన ఈ వేడుకలో కళ్యాణ్ రామ్ తోపాటు.. కమెడియన్ అలీ, చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు. స్వాగతోపాన్యాసం చేసిన సంస్థ వ్యవస్థాపకుడు బేతి రెడ్డి శ్రీనివాస్ తమ కార్యక్రమాలను వివరించారు. ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. అలాగే పి. సుశీల, నిర్మాత మైత్రి రవిశంకర్, వ్యాపారవేదత్త మువ్వా పద్మయ్య తదితరులు ప్రసగించారు.

ఇందులో నందమూరి కళ్యాణ్ రామ్ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నారు. ఉత్తమ నటిగా సమంత ఎంపిక అవ్వగా.. ఆమె అవార్డును సమంత బంధువులు అవార్డును స్వీకరించారు. ఉత్తమ చిత్రం అవార్డును బింబిసార బృందానికి అందించారు. అవార్డ్ అందుకున్న సందర్భంగా హీరో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. తాతగారితో తనను పోల్చవద్దన్నారు. ఆయన స్థాయికి తాను చేరుకోలేనని వ్యాఖ్యనించారు.

అటు హీరోగానే కాకుండా ఇటు నిర్మాతగానూ రాణిస్తున్నారు కళ్యాణ్ రామ్. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై పలు చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివ.. ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న సినిమాను కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.