AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna : మరోసారి గొంతు సవరించనున్న నటసింహం.. ముచ్చటగా మూడోసారి ఎన్టీఆర్ పాటను ఆలపించనున్న బాలయ్య

నట సింహం నందమూరి బాలకృష్ణ సినిమా అంటే అభిమానులకు పండగే. ఆయన సినిమా వస్తుందంటే అభిమానుల సందడి మాములుగా ఉండదు.

Balakrishna : మరోసారి గొంతు సవరించనున్న నటసింహం.. ముచ్చటగా మూడోసారి ఎన్టీఆర్ పాటను ఆలపించనున్న బాలయ్య
balayya-1
Rajeev Rayala
|

Updated on: Jun 03, 2021 | 7:17 AM

Share

Balakrishna : నట సింహం నందమూరి బాలకృష్ణ సినిమా అంటే అభిమానులకు పండగే. ఆయన సినిమా వస్తుందంటే అభిమానుల సందడి మాములుగా ఉండదు. బాలకృష్ణ, బోయపాటి… వీరిద్దరి కాంబోలో సినిమా అంటేనే ఓ రేంజ్ లో హైప్ వస్తుంది.. ప్రస్తుతం బాలయ్య బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కు బీబీ3 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ చేస్తున్నారు. ఇటీవలే చిత్రయూనిట్ ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు అఖండ అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఇక టైటిల్ తోపాటు టీజర్ ను కూడా విడుదల చేసారు చిత్రయూనిట్. దాంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందరెడ్డి దీనిని నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ కథానాయిక. తమన్ దీనికి సంగీత స్వరాలు సమకూరస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కాగా అందులో ఒకటి అఘోర పాత్ర. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వలో సినిమా చేస్తున్నాడు బాలయ్య . ఈ సినిమాలో మరో సారి ఫ్యాక్షనిస్ట్ గా అరలించనున్నాడు బాలకృష్ణ. ఇదిలా ఉంటే బాలకృష్ణ నటుడిగానే కాదు సింగర్ గాను తనలోని ప్రతిభను బయట పెడుతుంటారు. ఇప్పటికే పలు సందర్భాల్లో పాటలు పాడి ఆకట్టుకున్నారు. ఇక గత ఏడాది ఎన్టీఆర్ జయంతి సందర్బంగా బాలకృష్ణ తాను పాడిన శివ శంకరి శివానంద లహరి ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఇక ఈ ఏడాది లో ఎన్టీఆర్ జయంతి సందర్బంగా శ్రీరామ దండకంను బాలయ్య విడుదల చేశారు. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఎన్టీఆర్ పాటను ఆలపించనున్నారని తెలుస్తుంది. అయితే ఆయన ఈపాటను పడబోతున్నారు, ఏ సందర్భంలో పడబోతున్నారన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Balakrishna : యాక్షన్ ఎంటర్టైనర్ గా గోపీచంద్ మలినేని సినిమా.. పల్నాటి వీరుడిగా కనిపించనున్న బాలయ్య

Balakrishna : ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ పైన గుర్రుగా ఉన్న బాలయ్య అభిమానులు.. కారణం ఇదే..

బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం