Bhagavanth Kesari: “అడవి బిడ్డ…. నేలకొండ భగవంత్ కేసరి వచ్చిండు”.. దుమ్మురేపిన భగవంత్ కేసరి ట్రైలర్

చివరిగా వీరసింహారెడ్డి సినిమాతో సంచలన విజయం సాధించిన బాలయ్య ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. భగవంత్ కేసరి అనే పవర్ ఫుల్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.

Bhagavanth Kesari: అడవి బిడ్డ.... నేలకొండ భగవంత్ కేసరి వచ్చిండు.. దుమ్మురేపిన భగవంత్ కేసరి ట్రైలర్
Bhagavanth Kesari
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 08, 2023 | 8:34 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా వస్తుందంటే అభిమానుల్లో ఆనందానికి అవధులు ఉండవు. ఆయన సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. చివరిగా వీరసింహారెడ్డి సినిమాతో సంచలన విజయం సాధించిన బాలయ్య ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. భగవంత్ కేసరి అనే పవర్ ఫుల్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. ఈ సినిమాతో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ ఇస్తుంది. ఆమె ఈ సినిమాలో కాత్యాయిని అనే పాత్రలో టీచర్ గా కనిపించనుందని తెలుస్తోంది.

అలాగే లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది. బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా భగవంత్ కేసరి సినిమానుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణ తెలంగాణ యాసలో మాట్లాడి ఆకట్టుకోనున్నారు. ట్రైలర్ సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చింది. యాక్షన్ సీన్స్ తో పాటు అనిల్ రావిపూడి మార్క్ కామెడీ కూడా ఈ సినిమాలో ఉండనుంది. మరోసారి బాలకృష్ణ తనదైన నటన యాక్షన్ తో ఆకట్టుకోనున్నారని ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. అలాగే ఈ సినిమాలో తండ్రి కూతురు మధ్య ఎమోషన్స్ హైలైట్ గా ఉండనున్నాయి. తాజాగా భగవంత్ కేసరి మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వరంగల్ లో నిర్వహించారు.

‏మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.